GST COLLECTION FALLS TO NINETEENTH MONTHS LOW IN SEPTEMBER MS
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. 19 నెలల కనిష్టానికి పడిపోయిన జీఎస్టీ వసూళ్లు
ప్రతీకాత్మక చిత్రం
GST September Collection : గత నెలలో ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తర్వాత ద్రవ్య లోటు మరింత పెరిగింది. ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోవడంతో ద్రవ్య లోటుపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
దేశ ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ జీఎస్టీపై కూడా పడింది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 19 నెలల కనిష్టానికి పడిపోయాయి.వసూళ్లు 2.67% మేర తగ్గడంతో ప్రభుత్వ ఖజానాకు సెప్టెంబర్ నెలలో జీఎస్టీ ద్వారా సమకూరిన ఆదాయం రూ.91,916కోట్లు మాత్రమే.జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది వరుసగా రెండు నెలలు రూ.1లక్ష కోట్ల కంటే తక్కువగా నమోదవడం గమనార్హం.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.16,630 కోట్లు కాగా.. స్టేట్ జీఎస్టీ వాటా రూ.22598కోట్లు,ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.45,069కోట్లు,సెజ్ రూ.7,620కోట్లుగా నమోదయ్యాయి.
గత నెలలో ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తర్వాత ద్రవ్య లోటు మరింత పెరిగింది. ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు కూడా పడిపోవడంతో ద్రవ్య లోటుపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్ టార్గెట్ రీత్యా ప్రతీ నెలా కేంద్ర ప్రభుత్వానికి రూ.1ట్రిలియన్ అవసరం. కానీ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితులతో 2019-20 సంవత్సరానికి భారత్ నిర్దేశించుకున్న 3.3శాతం ద్రవ్య లోటు కట్టడిని చేరుకోవడం కష్టంగా కనిపిస్తోంది.కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.45కోట్ల లోటు ఏర్పడటంతో ద్రవ్య లోటు కట్టడి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే అంటున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.