దేశంలోని 8 ప్రధాన రంగాల్లో పడిపోయిన వృద్ధి రేటు..

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ జీడీపీ, గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 8 శాతం నమోదైన జీడీపీ.. ఈసారి మాత్రం 5శాతం నమోదైంది. దేశంలోని చాలా రంగాల్లో వృద్దిరేటు పడిపోవడంతో ఉద్యోగాల కోత కూడా మొదలైంది.దీంతో దేశం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: September 2, 2019, 6:17 PM IST
దేశంలోని 8 ప్రధాన రంగాల్లో పడిపోయిన వృద్ధి రేటు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్ ఆర్ధికమాంద్యంలో కూరుకుపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విడుదలైన డేటా ప్రకారం.. దేశంలోని 8 ప్రధాన రంగాల్లో వృద్ది రేటు పడిపోయింది. ఇందులో బొగ్గు,చమురు,సహజ వాయువు,రీఫైనరీ ఉత్పత్తులు, ఫర్టిలైజర్,స్టీల్,సిమెంట్,విద్యుత్ రంగాలు ఉన్నాయి. గత ఏడాది జులైలో 7.3శాతం వృద్ది రేటు నమోదైన ఈ రంగాల్లో..ఈ ఏడాది జులైలో మాత్రం 2.1శాతం మాత్రమే నమోదైంది. అయితే గత నెల కంటే ఇది మెరుగనే చెప్పాలి. జూన్‌లో ఈ ఎనిమిది రంగాల వృద్ది రేటు 4.3శాతం నుంచి 0.2శాతానికి పడిపోయింది.

కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ జీడీపీ, గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 8 శాతం నమోదైన జీడీపీ.. ఈసారి మాత్రం 5శాతం నమోదైంది. దేశంలోని చాలా రంగాల్లో వృద్దిరేటు పడిపోవడంతో ఉద్యోగాల కోత కూడా మొదలైంది.దీంతో దేశం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: September 2, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading