గేదెకు ఘనంగా బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేసి రచ్చ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

గేదెకు పుట్టినరోజు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు.

 • Share this:
  కొందరు పెంపుడు జంతువులు, పశువులను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. సొంత కుటుంబ సభ్యుడిలా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇంకొందరైతే తమ పిల్లలకు చేసినట్లే బర్త్ డే వేడుకలు కూడా చేస్తారు. తాజాగా మహారాష్ట్రలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. థానే జిల్లా డోంబివిలీ ప్రాంతానికి చెందిన కిరణ్ మాత్రే (30)కు పశువులంటే ఎంతో ప్రేమ. తన ఇంట్లో ఉండే గేదెను కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఇటీవల దానికి పుట్టిన రోజును కూడా చేశాడు. చుట్టుపక్కల ప్రజలందరినీ పిలిచి కేక్ కట్ చేయించి.. సంబరాలు నిర్వహించాడు కిరణ్ మోత్రే. గేదె బర్త్‌డే వేడులకు జనం భారీగా వచ్చారు. కానీ ఎవ్వరూ మాస్క్ ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు.

  గేదెకు బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారని, భారీగా జనం పోగయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు.. నేరుగా అక్కడికి వెళ్లారు. కరోనా సమయంలో ఎవరూ భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా కనిపించడంతో కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 269 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఐతే ఇప్పటి వరకైతే ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. మహారాష్ట్రలో చాలా మంది కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మాస్క్ ధరించని వారిపై జరిమానాల మోత మోగిస్తున్నారు పోలీసులు.

  మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. నాగ్‌పూర్ సహా పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. మహారాష్ట్రలో 36 జిల్లాలుంటే.. అందులో 10 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 8 జిల్లాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలను విధించారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కొన్ని చోట్ల కేవలం నిత్యావసర సరుకులను అమ్మే దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. మిగతావన్నీ మూతపడ్డాయి. మళ్లీ గత మార్చి నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: