హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Varun Singh: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత.. హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 14 మంది మృతి

Varun Singh: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత.. హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 14 మంది మృతి

Varun Singh: బెంగళూరు ఆర్మీ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. ఈ మేరకు భారత వైమానిక దళం అధికారిక ప్రకటన చేసింది. వరుణ్ సింగ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (Varun Singh) కన్నుమూశారు. డిసెంబరు 8న తమిళనాడు (Tamilnadu)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు మొత్తం 13 మంది మరణించగా.. వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఐతే బెంగళూరు ఆర్మీ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. ఈ మేరకు భారత వైమానిక దళం అధికారిక ప్రకటన చేసింది. వరుణ్ సింగ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.

వరుణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశానికి ఆయన చేసిన సేవలను మరవలేనివని ట్వీట్ చేశారు.

‘‘ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ తిరిగారు’’ : వారణాసిలో ప్రధాని ప్రసంగం

కాగా, డిసెంబరు 8న జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్టన్‌‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ సందర్శనకు వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్గర్ కూనూర్ సమీపంలో కూలిపోయింది. ఆ సమయంలో హెలికాప్టర్‌తో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో అదే రోజు 13 మంది మరణించారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను మొదట వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి బెంగళూరు కమాండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 8 రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తు వరుణ్ సింగ్ తుది శ్వాస విడిచారు.

Omicron: గుడ్‌న్యూస్.. ఆ టాబ్లెట్‌తో ఒమిక్రాన్ వేరియెంట్ మటాష్.. అద్భుతమైన ఫలితాలు

హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉండగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. సీడీఎస్ బిపిన్ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ లఖ్బిందర్ సింగ్ లడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్‌జిందర్ సింగ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ సాయితేజ, హవిల్దార్ సత్పాల్ రాయ్, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, జేడబ్ల్యూవో రాణా ప్రతాప్ దాస్, జేడబ్ల్యూ ప్రదీప్‌ మరణించారు. చాపర్ ప్రమాదంలో త్రివిధ దళాల అత్యున్నత స్థాయి అధికారితో పాటు 13 మరణించడంతో యావత్ దేశం కంటతడిపెట్టింది. వరుణ్ సింగ్ ఒక్కరైనా ప్రాణాలతో మిలిలారని అనుకున్నారు. కానీ ఆయన కూడా మరణిచండంతో మళ్లీ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐతే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వైమానిక దళం దర్యాప్తు చేస్తోంది.

First published:

Tags: IAF, Indian Air Force, Indian Army, Tamilnadu

ఉత్తమ కథలు