ముంబైలో కూలిన మూడంతస్థుల భవనం

రెస్క్యూ టీమ్ ఇప్పటివరకూ 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరికొందరు భవనం కింది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 11, 2019, 7:40 AM IST
ముంబైలో కూలిన మూడంతస్థుల భవనం
కూలిన మూడంతస్తుల భవనం
news18-telugu
Updated: September 11, 2019, 7:40 AM IST
దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ టీమ్ ఇప్పటివరకూ 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరికొందరు భవనం కింది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి కోసం సహాయకచర్యల్ని ముమ్మరం చేశారు. మంగళ్‌దాస్ రోడ్డులోగల లోహ్రా చాల్‌లోని యూసుఫ్ పేరుతో ఉన్న భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ భవనాన్ని 1959కి ముందుగా నిర్మించినట్లు తెలుస్తోంది. బీఎంసీకి చెందిన రెస్క్యూ సిబ్బందితో పాటు అగ్నిమాపకదళం సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నిన్నరాత్రి ఈ ఘటన చోటుచేసుకోవడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు తలెత్తాయి.First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...