HOME »NEWS »NATIONAL »groping without skin to skin contact is not sexual assault says bombay high court su gh

Sexual Assault: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉంటేనే శిక్ష

Sexual Assault: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉంటేనే శిక్ష
ప్రతీకాత్మక చిత్రం

లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపించేందుకు బలమైన ఆధారాలు ఉండాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తెలిపింది.

  • Share this:
లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపించేందుకు బలమైన ఆధారాలు ఉండాలని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తెలిపింది. సెక్స్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసి, స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ ఉంటేనే లైంగిక దాడికి పాల్పడినట్లుగా భావించాలని కోర్టు తేల్చింది. కేవలం చేత్తో తడమడం, పట్టుకోవడం వంటివి లైంగిక దాడికి సమానం కాదని సింగిల్ జడ్జి బెంచ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి శిక్షను తగ్గించాలనే అంశంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాలిక దుస్తులను బలవంతంగా తీసివేయడం, తన దుస్తుల్లోకి అసభ్యంగా చేతులు పెట్టడం వంటివి చేయకుండా, ఛాతీ భాగాన్ని తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని జస్టిస్ పుష్పా గణేడివాలా తెలిపారు.

లైంగిక వేధింపుల నేరానికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కానీ ఇందుకు బలమైన ఆధారాలు, ఆరోపణలు ఉండాలి. POCSO చట్టంలో లైంగిక వేధింపులను నిర్వచించారని న్యాయమూర్తి తెలిపారు. లైంగిక ఉద్దేశంతో దాడి చేయడం, పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను తాకడం లేదా నిందితుల ప్రైవేట్ పార్ట్స్‌ను తాకాలని పిల్లలను బలవంతం చేయడం వంటివి లైంగిక దాడి, లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. సెక్స్‌ చేయనప్పటికీ, ఆ ఉద్దేశంతో ఫిజికల్ కాంటాక్ట్ ఉండే ఏ ఇతర చర్యలైనా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు బాలిక దుస్తులను తీసివేసినట్లు, ఆమె ఛాతీని అసభ్యంగా నొక్కినట్లు రుజువు కాలేదు. ఇక్కడ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ లేదని జస్టిస్ గణేడివాలా తన తీర్పులో చెప్పారు.



* వేరే నేరం కిందకు వస్తుంది
ఈ కేసు POCSO ప్రకారం లైంగిక దాడి కిందకు రాదని, IPC సెక్షన్ 354 ప్రకారం మహిళలను అవమానపరచడం కిందకు వస్తుందని జస్టిస్ గణేడివాలా తెలిపారు. ఇందుకు ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు శిక్ష ఉంటుందన్నారు. మైనర్ బాలిక ఛాతీని అసభ్యంగా నొక్కడం, ఆమె దుస్తులు పాక్షికంగా చింపేయడం ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడాడ్డని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. జామపండు ఇస్తానని చెప్పి బాధితురాలికి ఆ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె తల్లి నిందితుడి ఇంటికి వెళ్లేటప్పటికి బాలిక ఏడుస్తూ ఉంది. జరిగిన విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పిందని, లైంగిక దాడి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రాసిక్యూషన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.
Published by:Sumanth Kanukula
First published:January 23, 2021, 12:42 IST