GreenHeros: ఈ అన్నదమ్ములు భేష్.. 48 గంటల్లో ఎన్నివేల మొక్కలు నాటారంటే.. రికార్డులకెక్కారు

48 గంటల్లో 5000 మొక్కలు నాటిన అన్నదమ్ములు (Image: Archana R/News18)

Green Heros from Tamilnadu | ప్రారంభంలో మొక్కలు నాటేందుకు తమ సొంత డబ్బు ఖర్చు చేశామని, ఆ తరువాత శివకాశి తాలూకాలోని ఒక ప్రైవేట్ కంపెనీ నిధులు సమకూర్చిందని శ్రీకాంత్, అరుణ్ వివరించారు.

  • Share this:
Green India | పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భావించే ఇద్దరు అన్నదమ్ములు.. మొక్కలు నాటడంలో రికార్డు సృష్టించారు. తమిళనాడులోని  (Tamilnadu) విరుదునగర్‌కు చెందిన ఇద్దరు సోదరులు 48 గంటల వ్యవధిలో ఏకంగా 5,000 మొక్కలు నాటి ప్రత్యేకత చాటుకున్నారు. అంతేకాక 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో (International book of records) వీరు చోటు దక్కించుకున్నారు. విరుధునగర్ జిల్లాలోని శివకాశి తాలూకా కల్లమనాయకన్‌పట్టికి చెందిన దీంతో అరుణ్ (25), శ్రీకాంత్ (22) ఇద్దరూ ఈ మొక్కలు నాటే యజ్ఞాన్ని చేపట్టారు. అరుణ్ చెన్నైలోని (Chennai) సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా, శ్రీకాంత్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.

ఈ విషయంపై సోదరులు ఇద్దరితో ‘న్యూస్ 18’ మాట్లాడింది. తామిద్దరం రోజుకు 8 గంటల సమయాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించామని చెబుతున్నారు శ్రీకాంత్. లాక్‌డౌన్‌లో లభించిన ఖాళీ సమయంలో ఇలా మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నామని చెప్పారు.

‘ఈ ఏడాది జనవరిలోనే ఈ నేచర్ ఛాలెంజ్‌ను స్వీకరించాం. మొదట్లో మా పెరట్లో తోటపనితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంట్లో నాటిన మొక్కలు బాగా పెరగడంతో, మొక్కలు నాటడంపై ఆసక్తి పెరిగింది. క్రమంగా మేమిద్దరం తమిళనాడు ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటి వరకు విరుదునగర్ జిల్లా పరిసరాల్లో 5,000 మొక్కలను నాటాం’ అని వివరించారు.


తాజా రికార్డు గురించి మాట్లాడుతూ.. ‘ముందు సైకిల్ ర్యాలీ నిర్వహించి, వాలంటీర్ల సహకారంతో మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను గుర్తించాం. ఫెన్సింగ్ వంటి సరైన రక్షణ, నీటి వనరులు ఉన్న ప్రాంతాలను గుర్తించాం. రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఆరు రోజులు ఇందుకు కేటాయించాం. ఇలా మొత్తం 48 గంటల వ్యవధిలో ఐదువేల మొక్కలను నాటాం’ అని శ్రీకాంత్ చెప్పారు.

తలుపులు బద్దలు కొట్టి చూస్తే షాకింగ్ సీన్.. ఇంట్లో ఐదుగురి మృతదేహాలు.. పాపం ఆ మూడేళ్ల చిన్నారి..



ఈ సోదరులు గతంలోనూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో అరుణ్, శ్రీకాంత్ 11 రోజుల పాటు కన్యాకుమారి నుంచి ముంబై వరకు సైకిల్ ర్యాలీ చేపట్టి, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంతో గతంలోనే 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకున్నారు. ఈ సైకిల్ ర్యాలీ విజయవంతమైన తరువాత మొక్కలు నాటడంపై వీరిద్దరూ దృష్టి పెట్టారు.

పింఛన్ అకౌంట్‌లో రూ. 52 కోట్లు.. షాక్ తిన్న వృద్దుడు.. అతడు ఏమన్నాడంటే..


ప్రారంభంలో మొక్కలు నాటేందుకు తమ సొంత డబ్బు ఖర్చు చేశామని, ఆ తరువాత శివకాశి తాలూకాలోని ఒక ప్రైవేట్ కంపెనీ నిధులు సమకూర్చిందని శ్రీకాంత్, అరుణ్ వివరించారు. త్వరలో విరుదునగర్ జిల్లాలో లక్ష మొక్కలు నాటనున్న కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులను కోరినట్లు శ్రీకాంత్ తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: