Poor People Shopping Mall: పేదలకు, అనాథలకు (Poor people and orphans )సాయం చేయాలని అనేక మంది అనుకుంటారు. కానీ వారికి ఎలా సాయం చేయాలో తెలియదు.. కేవలం ట్రస్టులకు విరాళం (Donations) ఇస్తున్నా.. సాయం చేసిన ఫీలింగ్ రావడం లేదంటున్నారు కొందరు. వ్యక్తిగతంగా సాయం చేయడం కన్నా.. అందరికీ ఉపయోగపడేలా ఏదైనా భారీగా చేస్తా బాగుటుంది అనుకుంటారు.. అలా వచ్చిన ఆలోచనతో కొంతమంది యువకులు సరికొత్త ప్రయత్నం చేశారు. గతంలో వాల్ ఆఫ్ కైండ్‌నెస్ (Wall of Kindness) పేరుతో పేదలకు దుస్తులు అందజేసే కార్యక్రమాన్ని కొందరు ప్రారంభించారు. ఓ చోటును ఎంచుకొని దుస్తులను అక్కడ పెడితే.. పేదలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం అప్పట్లో ప్రశంసలు అందుకుంది. కానీ నిర్వహణ సరిగా లేక.. దుస్తులు పాడైపోతున్నాయి. దీంతో ఇటీవల బెంగళూరు (Bangalore)కు చెందిన నలుగురు స్నేహితులకు కరోనా (Corona) సమయంలో ఆర్థికంగా చితికిపోయిన పేదలకు బట్టలు అందజేయాలన్న ఆలోచన వచ్చింది. వాల్ ఆఫ్ కైండ్నెస్లా కాకుండా మరింత కొత్తగా, భిన్నంగా ఆలోచించి.. ప్రజల నుంచి సేకరించిన దుస్తులతో పేదల కోసం ఏకంగా షాపింగ్మాల్నే ప్రారంభించారు. అయితే ఈ బట్టలను పేదలకు ఉచితంగా ఇవ్వరు.. ఏ దుస్తులకైనా ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది.
బెంగళూరుకు చెందిన మెలిషా నోరోన్హా.. ఆమె భర్త వినోద్.. నితిన్, విఘ్నేశ్ మంచి స్నేహితులు. వీరంతా కలిసి బెరటెనా అగ్రహారంలోని లవకుశ లేఅవుట్లో ‘ఇమాజిన్ క్లాత్ బ్యాంక్’పేరుతో నిరుపేదల కోసం షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. వారు ఉంటున్న కాలనీ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి దుస్తులను విరాళంగా తీసుకొని వాటిని శుభ్రం చేసి షాపింగ్‌మాల్‌లో విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి : ఆ ఊరి పేరు దీపావళి.. ఆ పేరు ఎలా వచ్చింది..? ఎక్కడ ఉంది..?
కేవలం ఆదివారాల్లో మాత్రమే తెరుచుకునే ఈ షాపింగ్‌మాల్‌లో పురుషులకు, మహిళలకు, పిల్లలకు, అన్ని వయసుల వారికి.. అన్ని రకాల దుస్తులు లభిస్తాయి. ఏ దుస్తులకైనా కేవలం 1 మాత్రమే తీసుకుంటారు. దీంతో పేదలకు కూడా నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకొనే అవకాశం లభిస్తుందని షాపింగ్‌మాల్ నిర్వాహకులు అంటున్నారు.
ఇదీ చదవండి : చాలామంది దీపారాధన సమయంలో చేసే తప్పు ఒకటుంది.. అదేంటంటే.
కళాశాలలో చదువుకునే రోజుల్లోనే అంటే 2002లో వినోద్, విఘ్నేశ్‌లు కలిసి దాతల నుంచి సేకరించిన దుస్తులతో పేదల కోసం చిన్న షాప్ పెట్టారట. 2013లో ‘ఇమాజిన్’ పేరుతో ట్రస్ట్‌ను కూడా నెలకొల్పారు. అయితే, కరోనా సమయంలో పేదల ఆర్థిక స్థోమత మరింత దిగజారి.. దుస్తులు కొనుగోలు చేసే పరిస్థితులు లేకపోవడం చూసి షాప్‌ను పునఃప్రారంభించాలని భావించారు.
ఇదీ చదవండి :దటీజ్ స్టాలిన్.. నరికురవ మహిళను కలిసిన సీఎం, కోట్ల విలువైన సంక్షేమ పథకాల ప్రకటన
గత సెప్టెంబర్‌లో ఈ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు 150కిపైగా పేద కుటుంబాలు వచ్చి దుస్తులు కొనుగోలు చేశాయని నిర్వాహకులు చెప్పారు. ఒక వ్యక్తి ఒక్కసారి గరిష్ఠంగా పది దుస్తులను మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన విధించారు. ఈ సేవ ఇలాగే కొనసాగించాలంటే.. దాతలు ముందుకురావాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Corona helping, Help, Help for poor, Life Style, National News