కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA) తీసుకొచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు ఇంకా రూపొందించబడనప్పటికీ పౌరసత్వం అందించిన డేటాను విడుదల చేసింది. 2018 నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారిలో ఎంత మందికి పౌరసత్వం అందించారనే విషయాన్ని కేంద్రం వెల్లడించింది. పార్లమెంటులో ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, ఈ కాలంలో మూడు పొరుగు దేశాల నుంచి హిందూ (Hindu), సిక్కు, జైన మరియు క్రైస్తవ మతాలకు చెందిన 8,244 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఈ ఏడాది డిసెంబర్ వరకు 3,117 మందికి పౌరసత్వం మంజూరైందని తెలపింది. అంతేకాకుండా, 2018 మరియు 2020 మధ్య, ప్రపంచవ్యాప్తంగా భారతీయ పౌరసత్వం పొందిన మొత్తం విదేశీయుల సంఖ్య 2,254. 2021కి సంబంధించిన మొత్తం డేటా అందుబాటులో లేదని వెల్లడించింది.
2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో పాకిస్తాన్ (Pakistan), బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) నుంచి హిందూ, సిక్కు, జైన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ బృందాల నుంచి స్వీకరించబడిన పౌరసత్వ దరఖాస్తుల సంఖ్య 8,244గా ఉంది. 2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ, సిక్కు, జైన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులకు మంజూరైన భారతీయ పౌరసత్వం సంఖ్య 3117 మంది అని హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభకు రాత పూర్వకంగా తెలిపారు.
Love Jihad Case: లవ్ జీహాద్ కేసులో యువకుడికి 10 ఏళ్లు జైలు.. జరిమానా.. కోర్టు సంచలన తీర్పు
భారతీయులకు శరణార్థుల విధానం లేదు. CAAని డిసెంబర్ 12, 2019న పార్లమెంటు ఆమోదించింది, కానీ దాని నియమాలు ఇంకా రూపొందించ లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ, జైన్, సిక్కు, పార్సీ, క్రిస్టియన్, బౌద్ధ వర్గాలకు చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య పార్లమెంటు ఆమోదించింది.
భారతీయ పౌరసత్వం మంజూరు చేసిన మొత్తం విదేశీయుల సంఖ్యకు సంబంధించి మరో ప్రశ్నకు సమాధానంగా, రాయ్ 201, 2020 మధ్య 4,177 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసినట్లు సభకు తెలియజేశారు. వీటిలో 2018లో 628, 2019లో 987, 2020లో 639 క్లెయిమ్‌లు ఆమోదించబడినట్టు తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి భారత పౌరసత్వం కోసం 10,635 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని రాయ్ సభకు తెలియజేశారు. వీటిలో పాకిస్తాన్ నుంచి 7,306, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1,152, బంగ్లాదేశ్ నుండి 161 క్లెయిమ్‌లు ఉన్నాయని వెల్లడించారు. ఇవి కాకుడా 428 దరఖాస్తులు కూడా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
2019లో CAA అమల్లోకి వచ్చిన తర్వాత, 2014 నుండి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లకు చెందిన దాదాపు 600 మంది ముస్లింలకు భారత పౌరసత్వం మంజూరు చేయబడిందని హోం మంత్రి అమిత్ షా ఓ మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Bangladesh, CAA, Citizenship Act, Pakistan, Parliament