హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తెరపైకి మరో కొత్త కూటమి... రాహుల్ గాంధీ ప్రధాని ఆశలు గల్లంతేనా?

మాయావతి, అఖిలేష్ యాదవ్ (ఫైల్ ఫొటోలు)

మాయావతి, అఖిలేష్ యాదవ్ (ఫైల్ ఫొటోలు)

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీని గద్దెదించడమే లక్ష్యమని చెబుతున్న పార్టీలు... కూటములుగా ఒక్కటవుతూనే మళ్లీ విడిపోతున్నాయి. కొత్త కూటములకు తెరతీస్తున్నాయి. తాజాగా పుట్టుకొచ్చిన మరో కూటమి రాహుల్ గాంధీ ఆశలకు గండికొడుతుందా?

ఇంకా చదవండి ...

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో మట్టికరిపించాలనుకున్న బీజేపీయేతర పక్షాల కూటమి రెండుగా చీలిపోయింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, మాజీ కేంద్ర మంత్రి అజీత్‌సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో విడిగా పోటీచేయాలని ఈ మూడు పార్టీల కూటమి నిర్ణయించినట్లు తెలిసింది. అఖిలేష్ యాదవ్, మాయావతి కూటమి ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్లను తమలో తాము పంచుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించి ఇతర ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో పడేశాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో... ఆర్‌ఎల్‌డీకి మూడు సీట్లు కేటాయించి మిగతా సీట్లను ఎస్పీ, బీఎస్పీ పంచుకోవాలని నిర్ణయించాయి. ఆ లెక్కన ఎస్పీ 37 సీట్లు, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేయబోతున్నాయి. మిగతావి రెండు సీట్లు. వాటిలో ఒకటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రెండోది యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న రాయబరేలీ. ఈ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించకూడదని ఈ కూటమి నిర్ణయించింది.

  ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు వరకూ... కాంగ్రెస్‌తోనే జట్టు కడతామన్నట్లు సంకేతాలిచ్చిన ఎస్పీ, బీఎస్పీ... సడెన్‌గా ప్లేట్ తిప్పేశాయి. కొత్త కూటమి ఏర్పాటు, సీట్ల పంపకంపై అఖిలేష్ యాదవ్ గానీ మాయావతి గానీ మాటమాత్రంగా కూడా కాంగ్రెస్ లేదా ఇతర మిత్రిపక్షాల నాయకులకు చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎలాంటి స్థానమూ కల్పించకూడదనే ఆలోచనతోనే ఎస్పీ, బీఎస్పీ తమలో తాము సీట్ల పంపకం చేసుకున్నాయని తెలుస్తోంది.

  bsp, sp, sp bsp alliance, sp bsp, sp bsp alliance 2019, sp and bsp grand alliance in 2019, sp bsp alliance in uttar pradesh, sp up bsp up, sp bsp seats, sp bsp friend, congress, bjp, sp bsp gathbandhan, sp bsp rld congress, sp bsp rld alliance, sp bsp rld alliance in up, sp bsp gathbandhan news, sp bsp mahagathbandhan, mahagathbandhan sp bsp, bsp sp alliance, sp-bsp alliance, congress, grand alliance, congress grand alliance, grand alliance in telangana, tdp-congress grand alliance, sp congress alliance,sp rld congress alliance,will congress join sp grand alliance, congress alliance, congress tdp alliance, congress - sp alliance, ktr slams tdp-congress grand alliance, up grand alliance, congress alliance with ttdp, congress samajwadi party alliance, congress leads alliance in telangana, pm narendra modi, narendra modi, rahul gandhi, modi, pm narendra modi, rahul gandhi vs narendra modi, rahul gandhi hugs narendra modi, narendra modi speech,rahul gandhi speech, rahul hugs modi,pm modi, rahul gandhi hugs narendra moid, rahul gandhi on modi, rahul gandhi funny, rahul gandhi hugs modi, rahul gandhi latest speech,rahul gandhi narendra modi,rahul gandhi hug narendra modi, rahul gandhi narendra modi hug, రాజకీయ కూటమి, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి, కూటమి గెలుస్తుందా?, మాయావతి అఖిలేష్ యాదవ్ కూటమి, ఎస్పీ బీఎస్పీ కూటమి, మరో కూటమి,
  స్టాలిన్ (ఫైల్ ఫొటో)

  స్టాలిన్ రేపిన చిచ్చు:

  నరేంద్ర మోదీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే కూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారనీ... కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మూడ్రోజుల కిందట చెన్నైలో ప్రతిపక్ష నాయకుల ముందు ప్రకటించటం తీవ్ర కలకలం రేపింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో స్టాలిన్ చేసిన ప్రకటన అఖిలేష్ యాదవ్, మాయావతికి ఎంతమాత్రం నచ్చలేదని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి.

  bsp, sp, sp bsp alliance, sp bsp, sp bsp alliance 2019, sp and bsp grand alliance in 2019, sp bsp alliance in uttar pradesh, sp up bsp up, sp bsp seats, sp bsp friend, congress, bjp, sp bsp gathbandhan, sp bsp rld congress, sp bsp rld alliance, sp bsp rld alliance in up, sp bsp gathbandhan news, sp bsp mahagathbandhan, mahagathbandhan sp bsp, bsp sp alliance, sp-bsp alliance, congress, grand alliance, congress grand alliance, grand alliance in telangana, tdp-congress grand alliance, sp congress alliance,sp rld congress alliance,will congress join sp grand alliance, congress alliance, congress tdp alliance, congress - sp alliance, ktr slams tdp-congress grand alliance, up grand alliance, congress alliance with ttdp, congress samajwadi party alliance, congress leads alliance in telangana, pm narendra modi, narendra modi, rahul gandhi, modi, pm narendra modi, rahul gandhi vs narendra modi, rahul gandhi hugs narendra modi, narendra modi speech,rahul gandhi speech, rahul hugs modi,pm modi, rahul gandhi hugs narendra moid, rahul gandhi on modi, rahul gandhi funny, rahul gandhi hugs modi, rahul gandhi latest speech,rahul gandhi narendra modi,rahul gandhi hug narendra modi, rahul gandhi narendra modi hug, రాజకీయ కూటమి, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి, కూటమి గెలుస్తుందా?, మాయావతి అఖిలేష్ యాదవ్ కూటమి, ఎస్పీ బీఎస్పీ కూటమి, మరో కూటమి,
  మాయావతి, సోనియా, రాహుల్

  కాంగ్రెస్ అంటే భయపడుతున్నారా:

  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినాయకత్వం, ఆ పార్టీలోని దిగ్విజయ్ లాంటి నేతలు వ్యవహరించిన తీరుపై మాయావతి, అఖిలేష్ యాదవ్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో అఖిలేష్ యాదవ్, మాయావతికి టెన్షన్ పట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే దానివలన కాంగ్రెస్‌కు మరింత మైలేజీ పెరుగుతుందనీ, తమకు మాత్రం ఎలాంటి లాభమూ ఉండదనే ఆలోచనతోనే ఎస్పీ, బీఎస్పీ విడిగా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయనే ప్రచారం మొదలైంది.

  bsp, sp, sp bsp alliance, sp bsp, sp bsp alliance 2019, sp and bsp grand alliance in 2019, sp bsp alliance in uttar pradesh, sp up bsp up, sp bsp seats, sp bsp friend, congress, bjp, sp bsp gathbandhan, sp bsp rld congress, sp bsp rld alliance, sp bsp rld alliance in up, sp bsp gathbandhan news, sp bsp mahagathbandhan, mahagathbandhan sp bsp, bsp sp alliance, sp-bsp alliance, congress, grand alliance, congress grand alliance, grand alliance in telangana, tdp-congress grand alliance, sp congress alliance,sp rld congress alliance,will congress join sp grand alliance, congress alliance, congress tdp alliance, congress - sp alliance, ktr slams tdp-congress grand alliance, up grand alliance, congress alliance with ttdp, congress samajwadi party alliance, congress leads alliance in telangana, pm narendra modi, narendra modi, rahul gandhi, modi, pm narendra modi, rahul gandhi vs narendra modi, rahul gandhi hugs narendra modi, narendra modi speech,rahul gandhi speech, rahul hugs modi,pm modi, rahul gandhi hugs narendra moid, rahul gandhi on modi, rahul gandhi funny, rahul gandhi hugs modi, rahul gandhi latest speech,rahul gandhi narendra modi,rahul gandhi hug narendra modi, rahul gandhi narendra modi hug, రాజకీయ కూటమి, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి, కూటమి గెలుస్తుందా?, మాయావతి అఖిలేష్ యాదవ్ కూటమి, ఎస్పీ బీఎస్పీ కూటమి, మరో కూటమి,
  రాహుల్, అఖిలేష్ యాదవ్ (ఫైల్ ఫొటో)

  నెక్ట్స్ ఏం జరగబోతోంది?

  దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలూ జట్టు కట్టి, మహాకూటమిలో చేరకపోతే నరేంద్రమోదీని ఓడించడం ఎలా అన్నది ప్రస్తుతం ఇతర విపక్షాలను తొలిచేస్తున్న ప్రశ్న. 12 రాష్ట్రాల్లో సొంతంగా మరో 3 రాష్ట్రాల్లో పొత్తులతో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవాలంటే... విపక్షాలన్నీ ఏకతాటిపై నడవడమే మంచిదని మిగతా పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

  bsp, sp, sp bsp alliance, sp bsp, sp bsp alliance 2019, sp and bsp grand alliance in 2019, sp bsp alliance in uttar pradesh, sp up bsp up, sp bsp seats, sp bsp friend, congress, bjp, sp bsp gathbandhan, sp bsp rld congress, sp bsp rld alliance, sp bsp rld alliance in up, sp bsp gathbandhan news, sp bsp mahagathbandhan, mahagathbandhan sp bsp, bsp sp alliance, sp-bsp alliance, congress, grand alliance, congress grand alliance, grand alliance in telangana, tdp-congress grand alliance, sp congress alliance,sp rld congress alliance,will congress join sp grand alliance, congress alliance, congress tdp alliance, congress - sp alliance, ktr slams tdp-congress grand alliance, up grand alliance, congress alliance with ttdp, congress samajwadi party alliance, congress leads alliance in telangana, pm narendra modi, narendra modi, rahul gandhi, modi, pm narendra modi, rahul gandhi vs narendra modi, rahul gandhi hugs narendra modi, narendra modi speech,rahul gandhi speech, rahul hugs modi,pm modi, rahul gandhi hugs narendra moid, rahul gandhi on modi, rahul gandhi funny, rahul gandhi hugs modi, rahul gandhi latest speech,rahul gandhi narendra modi,rahul gandhi hug narendra modi, rahul gandhi narendra modi hug, రాజకీయ కూటమి, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి, కూటమి గెలుస్తుందా?, మాయావతి అఖిలేష్ యాదవ్ కూటమి, ఎస్పీ బీఎస్పీ కూటమి, మరో కూటమి,
  రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

  రాహుల్ ప్రధాని ఆశలు గల్లంతేనా?

  మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడంతో... వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆ పార్టీ వర్గాలు అంచనాలు వేసుకున్నాయి. ఇప్పుడు చూస్తే, ప్రధాని సంగతేమోగానీ... అసలు కూటమిగా ఏర్పడటమే పెను సవాలవుతోంది. మాయావతి మొదటి నుంచీ మొండి పట్టుదలకు పోయేటైపు. ఛాన్స్ వస్తే, ప్రధాని పీఠం ఎక్కాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆమె. అలాంటి పార్టీలతో జట్టు కట్టేటప్పుడు కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించాలి. నిజానికి రాహుల్ ప్రధాని పీఠం ఎక్కాలనే ఆలోచన కంటే, బీజేపీని గద్దె దించాలన్న ఆవేశంతోనే పనిచేస్తున్నారు. కానీ స్టాలిన్ చేసిన ప్రకటన కూటమి పార్టీల్లో కలవరం కలిగించింది. చాలా పార్టీల్లోని సీనియర్లు... తాము పక్కకి తప్పుకొని రాహుల్‌కి ప్రధాని పీఠం ఇవ్వాలా? అన్న ఆలోచనలో ఉంటున్నారు. ఇదే మహాకూటమి కొనసాగింపుకి అవరోధంగా మారుతోంది.

  ఎస్పీ, బీఎస్పీ కలిసిరాకపోతే, మిగతా పార్టీలు కూడా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తిరిగి కమలనాథులకే గద్దెనెక్కే అవకాశం దక్కుతుంది. లోక్‌సభ ఎన్నికలు జరగడానికి మరో నాలుగు నెలల టైమ్ ఉంది. ఈలోగా కాంగ్రెస్ వేసే ఎత్తులు, వ్యవహరించే తీరు, విపక్షాల నిర్ణయాలు, కుదిరే ఒప్పందాలు... అన్నీ ఎన్నికల ముఖచిత్రాన్ని ఎలాగైనా మార్చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీలు డీల్స్ కుదుర్చుకునే అవకాశాలు ఉండటంతో... ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనాకు రాలేని పరిస్థితికి చేరాయి జాతీయ రాజకీయాలు.

  ఇవి కూడా చదవండి:

  ఆధార్‌ అడిగితే కోటి జరిమానా... కేంద్రం సంచలన నిర్ణయం

  తెలంగాణలో మరో రెండు జిల్లాలు... రెండు రెవెన్యూ డివిజన్లు

  తగ్గని చలి తీవ్రత... తెలుగు రాష్ట్రాల్లో 73కి చేరిన మృతుల సంఖ్య

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Bsp, Narendra modi, Rahul Gandhi, Sp-bsp

  ఉత్తమ కథలు