• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • GRADUATE STUDENT FILED A RAPE CASE ON 45 YEARS OLD WOMAN IN SIDDHARTHNAGAR UP FULL DETAILS HERE HSN

డిగ్రీ కుర్రాడు.. తనపై అత్యాచారం చేసిందంటూ ఓ మహిళపై కేసు పెట్టాడు.. అసలేం జరిగిందంటే..

డిగ్రీ కుర్రాడు.. తనపై అత్యాచారం చేసిందంటూ ఓ మహిళపై కేసు పెట్టాడు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

2020వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున మొమైనా ఆ యువకుడి ఇంటికి వెళ్లింది. తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయమని ఆ యువకుడి తల్లిదండ్రులను కోరింది. అందుకు ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో..

  • Share this:
    ఓ మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడిందో మహిళ. కొన్నాళ్ల పాటు అతడిని బెదిరించి లైంగికంగా వేధించింది. ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడింది. మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని కోరింది. దానికి ఆ బాలుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మా అబ్బాయి ఇంకా చదువుకోవాలనీ, అప్పుడే పెళ్లేంటని అతడి తల్లిదండ్రులు ఆమె ప్రతిపాదనకు బ్రేకులు వేశారు. దీంతో ఆమెకు ఆగ్రహం తన్నుకొచ్చింది. ఆ బాలుడి తల్లిదండ్రులను బెదిరించింది. తనకు ఉన్న పలుకుబడితో మీ అబ్బాయిని కేసుల్లో ఇరికిస్తాననీ, జైలు పాలు చేస్తానని హెచ్చరించింది. కానీ, చివరకు ఆమె కటకటాల పాలయింది. జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సిద్దార్థ్ నగర్ జిల్లాలో మొమైనా ఖతూన్ అనే 45 ఏళ్ల మహిళ ఉంది. ఆమె ఇంటి పక్కనే ఓ ఉపాధ్యాయుడు ట్యూషన్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆ ట్యూషన్ కు వచ్చే ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిపై ఆమె లైంగిక దాడికి పాల్పడింది. ఎవరికీ చెప్పొద్దని బెదిరించింది. ఈ ఘటన 2016వ సంవత్సరం జూలై 10వ తారీఖున జరిగింది. అప్పటి నుంచి అతడిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఆ బాలుడు డిగ్రీ చదువుతున్నాడు. 2020వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున మొమైనా ఆ యువకుడి ఇంటికి వెళ్లింది. తన కూతురికి ఇచ్చి పెళ్లి చేయమని ఆ యువకుడి తల్లిదండ్రులను కోరింది. అందుకు ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరస్కరించారు. ఇంత చిన్న వయసులో మా అబ్బాయికి పెళ్లేంటని ఆమె విన్నపాన్ని తోసిపుచ్చారు.
    ఇది కూడా చదవండి: అర్ధరాత్రి.. రెండు గంటల సమయం.. గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులు.. ఆ 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఏం చేసిందంటే..

    దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన ఆమె ఆ యువకుడిని హెచ్చరించింది. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిస్తానని బెదిరించింది. దీంతో ఆ కుర్రాడు పోలీస్ స్టేషన్ మెటెక్కాడు. తెలిసీ తెలియని వయసులో తనపై ఆమె లైంగిక దాడికి పాల్పడిందనీ, ఇప్పుడు మళ్లీ తననే బ్లాక్ మెయిల్ చేస్తోందని అతడు కేసు పెట్టాడు. సిద్దార్థ్ నగర్ లోని సదర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఈ కేసు నమోదయింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ఇంట్లోంచి భార్య మాయం.. ప్రియుడితో వెళ్లిందని తెలిసి వెతుక్కుంటూ వెళ్లిన భర్త.. చివరకు కథ అడ్డం తిరిగింది..!
    Published by:Hasaan Kandula
    First published: