దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ.. అమిత్ షా సంచలన కామెంట్స్..

NRC | అక్రమ చొరబాటుదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, వారిని భారత్ నుంచి తరిమేయాలని అమిత్ షా అన్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 7:16 PM IST
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ.. అమిత్ షా సంచలన కామెంట్స్..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (File Photo)
news18-telugu
Updated: September 18, 2019, 7:16 PM IST
కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌర పట్టికను దేశం మొత్తం అమలు చేస్తామని ప్రకటించారు. హిందుస్తాన్ టైమ్స్ పత్రిక నిర్వహించిన పూర్వోదయ్ హిందుస్తాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడానికి జాతీయ పౌరపట్టిక కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘ఎవరైనా అక్రమంగా అమెరికా, బ్రిటన్, రష్యా వెళ్లి నివసించగలరా? లేదు. అలాంటప్పుడు భారత్‌లో మాత్రమే సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఎలా ఉండగలరు?. అందుకే జాతీయ పౌర పట్టికను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనేది నా ఉద్దేశం.’ అని అమిత్ షా అన్నారు. ఇప్పటి వరకు దేశంలో అసోం మాత్రమే జాతీయ పౌరపట్టికను కలిగి ఉంది. ‘ఎన్ఆర్సీ అంటే అసోం పౌర పట్టిక కాదు. జాతీయ పౌర పట్టిక. దాన్ని దేశం మొత్తం అమలు చేయాలి. పౌరుల జాబితాను సేకరించాలి.’ అని అమిత్ షా అన్నారు. అక్రమ చొరబాటుదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, వారిని భారత్ నుంచి తరిమేయాలని అమిత్ షా అన్నారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...