డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేయబోతున్నాం: కేంద్రమంత్రి

ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్స్ అనుసంధానం వల్ల డూప్లికేట్ లైసెన్స్‌లకు చెక్ పెట్టవచ్చునని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.ఒకవేళ యాక్సిడెంట్‌కు కారణమైన వ్యక్తి.. డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి వెళ్తే.. అతనికి అప్పటికే ఒక లైసెన్స్ ఉందన్న విషయం అధికారులకు తెలిసిపోతుందన్నారు.

news18-telugu
Updated: January 6, 2019, 8:55 PM IST
డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేయబోతున్నాం: కేంద్రమంత్రి
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్(File)
  • Share this:
కేంద్ర సర్కార్ త్వరలోనే మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నట్టు తెలిపారు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనిర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు త్వరలోనే మేమొక చట్టాన్ని తీసుకురాబోతున్నాం. యాక్సిడెంట్ కేసుల్లో.. చాలా సందర్భాల్లో నిందితులు పారిపోయి.. ఆపై డూప్లికేట్ లైసెన్స్ పొందడం ద్వారా తప్పించుకుంటున్నారు. ఇది మారాలంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అలా అయితే వేలి ముద్రలు లేదా ఐరిస్ ద్వారా నిందితులను సులువుగా పట్టుకోవచ్చు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్


ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్స్ అనుసంధానం వల్ల డూప్లికేట్ లైసెన్స్‌లకు చెక్ పెట్టవచ్చునని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.ఒకవేళ యాక్సిడెంట్‌కు కారణమైన వ్యక్తి.. డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి వెళ్తే.. అతనికి అప్పటికే ఒక లైసెన్స్ ఉందన్న విషయం అధికారులకు తెలిసిపోతుందన్నారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో ఇదొక భాగమని.. 130కోట్ల మంది ఉన్న దేశంలో 123కోట్ల ఆధార్ కార్డులు, 121కోట్ల మొబైల్ ఫోన్స్, 44.6కోట్ల స్మార్ట్ ఫోన్స్, 56కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని చెప్పారు. ఈ-కామర్స్ రంగంలో దేశం 51శాతం వృద్ది రేటును సాధించిందని తెలిపారు.
First published: January 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు