మత్స్యకారుల కోసం రూ. 20వేల కోట్లు కేటాయింపు

ప్రతీకాత్మక చిత్రం

వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు నిర్మల సీతారామన్. చేపలతో పాటు సీవీడ్ పెంపకంపైనా రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు.

  • Share this:
    ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా మత్య్సకారులకు రూ.20వేల కోట్లు కేటాయించింది కేంద్రం. బడ్జెట్‌లోనే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రకటించామని.. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. రూ.20 వేల కోట్లలో.. రూ.11 వేల కోట్లు మెరైన్, ఇన్‌లాండ్ ఫిషరీస్, అక్వాకల్చర్‌కు, మరో 9వేల కోట్లు ఫిషింగ్ హార్బర్స్, కోల్డ్ చైన్, మార్కెట్‌కు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఫిషరీస్, ఆక్వా కల్చర్‌లో మరో 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆమె చెప్పారు.

    అంతేకాదు వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు నిర్మల సీతారామన్. చేపలతో పాటు సీవీడ్ పెంపకంపైనా రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధిస్తామని అంచనా వేస్తున్నామని ఆమె తెలిపారు. మౌలిక సదుపాయాలు, సామర్థ్యాల పెంపు ద్వారా ప్రతి ఒక్కరూ స్వావలంబన సాధించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్.
    Published by:Shiva Kumar Addula
    First published: