ఎయిరిండియా ప్రైవేటీకరణ.. మొత్తం అమ్మేసేందుకు రంగం సిద్ధం..

2018లో తొలిసారి ఎయిరిండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్రం అడుగులు వేసింది. అప్పుడు కేంద్రం పెట్టిన షరతులతో ప్రైవేట్ ఆపరేటర్లు అంతగా ఆసక్తి చూపలేదు.

news18-telugu
Updated: October 9, 2019, 7:34 PM IST
ఎయిరిండియా ప్రైవేటీకరణ.. మొత్తం అమ్మేసేందుకు రంగం సిద్ధం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన బిడ్‌లను ఆహ్వానించనున్నట్టు లైవ్ మింట్ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం... ఎయిరిండియాలో 100 శాతం వాటాలను విక్రయించేందుకు కేంద్రం రెడీగా ఉంది. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల ప్యానెల్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రుల ఆమోదం తెలిపిన తర్వాత బిడ్లను ఆహ్వానిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూ.1.05 ట్రిలియన్లను పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుల వల్ల ఖజానాకు రూ.1.49 ట్రిలియన్ల ఆదాయం తగ్గుతుందని అంచనా.

ఎయిరిండియాకు సంబంధించి ఏర్పాటు చేసిన మంత్రుల ప్యానెల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ మంత్రుల ప్యానెల్ సభ్యులు. సెప్టెంబర్ 19న వారంతా ఓ సారి సమావేశం అయ్యారు. ఎయిరిండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఉన్న అవకాశాలను విశ్లేషించింది.

2018లో తొలిసారి ఎయిరిండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్రం అడుగులు వేసింది. ఆ సందర్భంగా బిడ్లను ఆహ్వానించినప్పుడు కేంద్రం 24 శాతం వాటాను తమ వద్దే ఉంచుకుంటామని ప్రకటించింది. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ సారి 100 శాతం వాటాను విక్రయించి పూర్తిగా ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎయిరిండియాకు రూ.33వేల కోట్ల అప్పులు ఉన్నాయి. 128 విమానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి.

SBI Good News | హోమ్‌లోన్ వడ్డీ రేట్లు తగ్గాయి... కస్టమర్లకు పండగే..


First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading