హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PIL on Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పై సుప్రీంలో పిల్.. ప్రతివాదిగా ప్రభుత్వం.. పిటిషనర్ ఎలాంటి హామీ కోరాడో తెలుసా?

PIL on Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ పై సుప్రీంలో పిల్.. ప్రతివాదిగా ప్రభుత్వం.. పిటిషనర్ ఎలాంటి హామీ కోరాడో తెలుసా?

1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక ఏపీలో సీఎం జగన్ చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక ఏపీలో సీఎం జగన్ చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

విశాల్ తివారీ అనే పిటిషనర్ తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోవిడ్-19 నకిలీ టీకాలు వేసే ప్రమాదానికి వ్యతిరేకంగా పౌరుల భద్రత కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రంతో సహా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

మార్కెట్లోకి ఏ కొత్త వస్తువు లేదా ఉత్పత్తి వచ్చినా నకిలీగాళ్ల అధికంగా ఉంటుంది. పేరు మోసిన సంస్థ నుంచి ఎలాంటి బ్రాండ్ విడుదలైనా ఫేక్ వస్తువును దాని వెనకే విడుదల చేస్తుంటారు. కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) ఇంకా రాకముందే ఇదిగో వ్యాక్సిన్ వచ్చేసిందంటూ నకిలీ వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కోవిడ్ నకిలీ వ్యాక్సిన్ల నిరోధించాలని, ఇలాంటి వాటిపై కఠిన ఆంక్షల అమలు చేయాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation-PIL) వేశారు ఓ న్యాయవాది. ఈ అంశంపై ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విశాల్ తివారీ అనే పిటీషనర్ తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కోవిడ్-19 నకిలీ టీకాలు వేసే ప్రమాదానికి వ్యతిరేకంగా పౌరుల భద్రత కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రంతో సహా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు.

ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా నకిలీ కోవిడ్-19 వ్యాక్సిన్(Fake Covid Vaccine) ను విక్రయించడం లేదా ప్రసారం చేయడం నేరపూరిత చర్యగా భావించి ఈ వార్తలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని రూపొందించాలని తివారీ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ హక్కు అనేది సురక్షితంగా జీవించే హక్కుగా పరిగణించే ఆర్టికల్-21(Article 21) కింద పొందుపర్చారని, ఈ మహమ్మారి సమయంలో నకిలీ చికిత్స నుంచి రక్షణకు హామీ ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంటర్పోల్ తన అన్ని సభ్య దేశాలకు ఆరెంజే నోటీసును జారీచేసిందని అన్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంతో పాటు అనేక నేర సంస్థలు చురుకుగా ఉంటాయని, నకిలీ టీకాలను విక్రయిస్తాయని హెచ్చరించారు.

ఈ నేరపూరిత చర్యలు భౌతికంగానే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా జరుగుతుందని తెలిపారు. ఈ మోసాలకు పాల్పడటానికి చాలా వెబ్ సైట్లు చురుకుగా ఉంటాయని తివారీ తన పిటిషన్ లో దాఖలు పరిచారు. నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ ను మార్కెటింగ్ చేయడంలో, విక్రయించడంలో వారు విజయవంతమైతే అది గందరగోళ పరిస్థితులు తలెత్తడమే కాకుండా అసమతూల్యతకు దారితీస్తుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం నడుపుతున్న టీకా కార్యక్రమానికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా కరోనా నివారణకు బదులుగా మరింత ఘోరమైన ప్రభావాలను తీసుకొస్తుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Corona, Corona Vaccine, Supreme Court

ఉత్తమ కథలు