రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్ న్యూస్... నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన...

రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ కలసి రూ.25000 కోట్ల పెట్టుబడులు పెడతాయని ప్రకటించారు.

news18-telugu
Updated: November 6, 2019, 8:32 PM IST
రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్ న్యూస్... నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన...
నిర్మలా సీతారామన్ (File)
  • Share this:
దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. ఆర్థిక మందగమనం వల్ల ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ కలసి రూ.25000 కోట్ల పెట్టుబడులు పెడతాయని ప్రకటించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం కల్పించేందుకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఫండ్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు, మిగిలిన నిధులను ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ కలసి సంయుక్తంగా పెట్టుబడి పెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా 1600 ప్రాజెక్టుల్లో 4.8లక్షల హౌసింగ్ యూనిట్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధిని ప్రాధాన్యక్రమంలో వినియోగించనున్నారు. ఎక్కువ శాతం పూర్తయి.. కొంచెం మిగిలిన ప్రాజెక్టులు, అందరికీ అందుబాటు ధరల్లో ఉండే గృహాలు, మధ్యతరహా హౌసింగ్ ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఆ నిధులను ఖర్చుపెట్టనున్నారు.

మ్యాన్ హోల్ క్లీన్ చేస్తున్న రోబోను చూశారా?First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు