NCH Chatbot: టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చాట్‌జీపీటీ (ChatGPT) పేరే వినిపిస్తోంది. చరిత్రలో ఇప్పటివరకు ఏ ఏఐ చాట్‌బాట్(AI Chatbot) చేయలేని పనులను చాట్‌జీపీటీ క్షణాల్లో చేయడమే ఇందుకు కారణం. అపారమైన నాలెడ్జితో చాలా లాజికల్‌గా ఏ విషయంలోనైనా ఆన్సర్లు ఇవ్వగల ఈ ఏఐని(AI) సద్వినియోగం చేసుకునేందుకు సామాన్యులతో పాటు ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నాయి. తాజాగా భారత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Consumer Affairs) సైతం చాట్‌జీపీటీ సామర్థ్యాలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ఈ మంత్రిత్వ శాఖ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో వినియోగదారులు చాలా సులభంగా ఫిర్యాదులు చేయడానికి చాట్‌జీపీటీ-ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ విషయాన్ని తాజాగా ఓ సీనియర్ అధికారి తెలిపారు.
చాట్‌జీపీటీ టెక్నాలజీతో నడిచే ఆ సిస్టమ్‌ను ఉపయోగించి వ్యక్తులు తమ ఫిర్యాదులను వాయిస్ నోట్స్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఈజీగా నివేదించగలరని అధికారి పేర్కొన్నారు. రిపోర్ట్స్ ప్రకారం, వినియోగదారుల కమిషన్లతో కస్టమర్లు చాలా సులభంగా ఫిర్యాదులను దాఖలు చేయడానికి AI టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకునేందుకు మంత్రిత్వ శాఖ OpenAI సంస్థ ఎగ్జిక్యూటివ్‌లతో కూడా చర్చించింది. ఆ విధంగా ఫిర్యాదులు ఉన్న కస్టమర్లకు సహాయం చేయడానికి, వారికి ఫిర్యాదులు చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి AI-ఎనేబుల్డ్ టెక్నాలజీని తీసుకొచ్చే అంశంపై మంత్రిత్వ శాఖ సమాలోచనలు జరుపుతోంది.
TCS: జులై 1 నుంచి విదేశీ ప్రయాణం భారం..ఫారెన్ టూర్ ప్యాకేజీపై 20% ట్యాక్స్
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, OpenAI మధ్య భాగస్వామ్యం కుదిరితే, వినియోగదారులు తమ ఫిర్యాదులను టెక్స్ట్ మెసేజ్‌లు లేదా వాయిస్ నోట్‌లను ఉపయోగించి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కి సబ్మిట్ చేయవచ్చు. అంటే వారు ఫిర్యాదులు చేయడానికి హెల్ప్‌లైన్‌కు కాల్ చేయనవసరం లేదు. ఆఫీసులకు వెళ్లాల్సిన పని కూడా తప్పుతుంది. మరోవైపు భారత ప్రభుత్వం తన సొంత చాట్‌జీపీటీ వెర్షన్‌ను రూపొందించాలని కూడా యోచిస్తోంది. భారత చాట్‌జీపీటీకి సమానమైన అంశం గురించి కొన్ని వారాల్లో ప్రకటన చేయనున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఇక రైతులకు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి చాట్‌జీపీటీ-ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌లను పరిచయం చేయాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ముందు అడుగులు వేస్తోంది. ఇక భారతీయ న్యాయస్థాన వ్యవస్థలో మొదటిసారిగా, క్రూరత్వంతో కూడిన దాడి కేసులో ప్రపంచవ్యాప్తంగా బెయిల్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి పంజాబ్ & హర్యానా హైకోర్టు ChatGPTని ఉపయోగించింది. హింసాత్మక క్రూరమైన నేరానికి పాల్పడిన నిందితుడి బెయిల్ పిటిషన్ వ్యవహారంలో కోర్టు AIని ఉపయోగించింది. ఏఐ ఎలాంటి ప్రశ్నకైనా సరైన సమాధానం ఇవ్వగలదు. అందుకే దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా ఏఐ టెక్నాలజీని యూజర్లకు అందజేయడం ప్రారంభించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatgpt