Home /News /national /

PM Modi : అన్నిటికీ బదులిస్తాం.. కానీ ఆ విషయంలో జాగ్రత్త -ఇది చాలా ఇంపార్టెంట్.. అంతలోనే వాయిదా

PM Modi : అన్నిటికీ బదులిస్తాం.. కానీ ఆ విషయంలో జాగ్రత్త -ఇది చాలా ఇంపార్టెంట్.. అంతలోనే వాయిదా

పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతోన్న ప్రధాని మోదీ

పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతోన్న ప్రధాని మోదీ

సాగు చట్టాల రద్దు సహా మొత్తం 26 బిల్లులు ఆమోదం పొందాల్సిన, యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతోన్న ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాజకీయంగానూ ప్రాధాన్యం పెరిగింది. ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్లు చేశారు..

ఇంకా చదవండి ...
దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతోన్నవి కావడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాజకీయాంగానూ ప్రాధాన్యం పెరిగింది. సాగు చట్టాల రద్దు సహా మొత్తం 26 బిల్లుల్ని మోదీ సర్కార్ సభలో ప్రవేశపెట్టుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ మొదలుకావడానికి కొద్ది నిమిషాల ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సెషన్ దేశానికి అత్యంత ముఖ్యమైనదన్నారు..

‘ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా ముఖ్యమైనవి. రెండు సభలూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని కోరుకుంటున్నా. సభలో అన్ని ప్రశ్నలకు బదులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్లమెంటులో జరగాల్సిన ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూడాలి..’అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సమయంలోనే కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమెక్రాన్ విదేశాల్లో విజృంభిస్తుండగా, భారత్ లో దానిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒమెక్రాన్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృతోత్సవ్ నిర్వహిస్తున్నామని, స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ క్రమంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

సాగు చట్టాల రద్దు బిల్లుల్ని సభలో పెట్టున్న కేంద్రం.. వాటిపై సమగ్రంగా చర్చించాలని, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టాన్ని కూడా చేయాలని, పెగాసస్ నిఘా కుట్ర, ధరల పెరుగుదల తదితర అంశాలపైనా ఉభయ సభల్లో చర్చించాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ రచ్చకు దిగాయి. విపక్షాల అరుపుల మధ్య సబ నడపలేక స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు..
Published by:Madhu Kota
First published:

Tags: Parliament Winter session, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు