హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu Kashmir Map: కశ్మీర్ బోర్డర్‌ను తప్పుగా చూపిన వికీపీడియా... సరిదిద్దుకోవాలని హెచ్చరించిన ప్రభుత్వం

Jammu Kashmir Map: కశ్మీర్ బోర్డర్‌ను తప్పుగా చూపిన వికీపీడియా... సరిదిద్దుకోవాలని హెచ్చరించిన ప్రభుత్వం

భారత జాతీయ పతాకం (ప్రతీకాత్మక చిత్రం)

భారత జాతీయ పతాకం (ప్రతీకాత్మక చిత్రం)

Jammu Kashmir Map: ఇండియన్ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తే చర్యలు తీసుకుంటామని భాతర ప్రభుత్వం వీకీపీడియాను హెచ్చరించింది.

ఇండియన్ మ్యాప్‌ను తప్పుగా చూపిస్తే చర్యలు తీసుకుంటామని భాతర ప్రభుత్వం వీకీపీడియాను హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్ మ్యాప్ను, కశ్మీర్ బోర్డర్‌ను తప్పుగా చూపించిన లింక్‌ను తమ ప్లాట్ఫాం నుంచి తొలగించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బుధవారం వికీపీడియాను ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 69A ప్రకారం మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. వికీపీడియా అనేది ఒక ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. వికీ బేస్డ్ ఎడిటింగ్ సిస్టమ్ను ఉపయోగించి వాలంటీర్లు దీన్ని నిర్వహిస్తారు. కశ్మీర్ మ్యాప్లో తప్పులు ఉండటాన్ని ఛత్రసల్ సింగ్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇండియా- భూటాన్ రిలేషన్షిప్ గురించి అతడు సెర్చ్ చేశాడు. సంబంధిత వికీపీడియా పేజీలో జమ్మూ కశ్మీర్ సరిహద్దును తప్పుగా మ్యాపింగ్ చేసినట్లు గుర్తించాడు.

సరిచేయని వికీపీడియా

మ్యాప్ విషయంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నవంబర్ 27న వికీపీడియాకు ఆదేశాలు జారీ చేశారు. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా ఉన్న ఈ పేజీని తొలగించాలని కోరారు. తమ ఆదేశాలను వికీపీడియా పాటించకపోతే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్- 2000లోని సెక్షన్ 69A ప్రకారం మొత్తం ప్లాట్ఫామ్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. దీంతో పాటు ప్రభుత్వం వికీపీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు వికీపీడియా మాత్రం మ్యాప్ను సరిచేయలేదు.

తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం

విదేశీ సంస్థలు కశ్మర్ విషయంలో తప్పులను పునరావృతం చేస్తున్నాయి. గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పనిచేసే అమెజాన్ వర్చువల్ అసిస్టెంట్ అలెక్సా కూడా కశ్మీర్ను చైనాకు చెందిన భూభాగమని చెప్పింది. దీనిపైన కూడా పెద్ద వివాదం చెలరేగింది. కశ్మీర్ ఏ దేశంలో ఉందని ఒక యూజర్ హిందీలో అలెక్సాను అడగ్గా.. కశ్మీర్ చైనాలో ఒక భాగమని అలెక్సా రిప్లై ఇచ్చింది. అక్టోబర్లో ట్విట్టర్ కూడా ఇదే తప్పు చేసింది. జమ్మూ కశ్మీర్ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక భాగంగా చూపించింది. ఈ విషయాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF)కు చెందిన కాంచన్ గుప్తా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి తప్పులపై ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి తప్పులను సరిదిద్దుకోకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Jammu and Kashmir

ఉత్తమ కథలు