Abortion Rules: అబార్షన్‌ నిబంధనలను మార్చిన కేంద్ర ప్రభుత్వం.. కొత్త రూల్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

New Abortion Rules: మెడిక‌ల్ టెర్మినేష‌న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం- 2021 ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న గ‌రిష్ఠ ప‌రిమితిగా ఉన్న 20 వారాల నిబంధనలో కొన్ని మార్పులు చేసింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
గర్భాన్ని తొల‌గించే ప్ర‌క్రియ అయిన అబార్ష‌న్ల‌ (Abortion)కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. మెడిక‌ల్ టెర్మినేష‌న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం- 2021 (Medical termination of pregnancy Act-2021) ప్ర‌కారం ప్ర‌స్తుతం ఉన్న గ‌రిష్ఠ ప‌రిమితిగా ఉన్న 20 వారాల నిబంధనలో కొన్ని మార్పులు చేసింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల గ‌ర్భిణీలు (Pregnants)  అబార్ష‌న్ చేయించుకోవాల‌నుకుంటే.. గ‌ర్భం దాల్చిన 20 వారాల లోపే చేయించుకోవాలి. ఈ గడువు దాటితే చట్టప్రకారం అబార్ష‌న్ చేయ‌రు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన రూల్స్ ప్ర‌కారం.. అబార్ష‌న్ గ‌రిష్ఠ ప‌రిమితి 24 వారాల‌కు పెరిగింది. అంటే మ‌రో నెల రోజులు ఎక్కువ పొడిగించింది. ఈ రూల్స్‌ను మెడిక‌ల్ టెర్మినేష‌న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లోని సెక్ష‌న్- 6లో కేంద్రం పొందుప‌రిచింది. స‌వ‌ర‌ణ చేసిన ఈ చ‌ట్టం 24 సెప్టెంబ‌ర్ 2021 నుంచే అమ‌లులోకి వ‌చ్చింద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. దీనికి సంబంధించిన నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌(New Guidelines)ను కూడా ప్రభుత్వం విడుద‌ల చేసింది.

Viral: పెళ్లి వేడుకలో 60 కిలోల బంగారు ఆభరణాలు ధరించిన వధువు.. ఫోటోలు వైరల్..

* 24 వారాల వ‌ర‌కు ఎవ‌రు అబార్ష‌న్ చేయించుకునేందుకు అర్హులు..?

సాధార‌ణంగా గ‌ర్భం దాల్చిన పెళ్ల‌యిన మ‌హిళ‌లకు ఈ రూల్స్ వ‌ర్తించ‌వు. మెడిక‌ల్ టెర్మినేష‌న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్ర‌కారం.. 24 వారాల లోపు అబార్ష‌న్ చేయించుకోవాల‌నుకుంటే.. వాళ్లు మైన‌ర్ (Minor Girls) అయి ఉండాలి. లైంగిక దాడికి గుర‌యినవారు, అత్యాచారానికి గురైనవారు (Rape Victims), భ‌ర్త చ‌నిపోయిన వాళ్లు (widows), విడాకులు తీసుకున్న వాళ్లు (Divorced women), దివ్యాంగులు, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడుతున్న మహిళలు  (Mentally Disabled women)అబార్షన్ చేయించుకోవచ్చు. క‌డుపులో ఉన్న బిడ్డ వ‌ల్ల త‌ల్లికి ప్రాణాపాయ స్థితి ఏర్ప‌డిన‌ప్పుడు, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఏర్పడిన‌ప్పుడు, విప్త‌తు ఏర్ప‌డిన‌ప్పుడు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో మాత్రమే 24 వారాల లోపు ఆబార్ష‌న్ చేయించుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌నుంది.

covaxin: వచ్చే నెల నుంచే పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ -ముందుగా వీరికే -అనుమతి రాలేదన్నమంత్రి

ఒక‌వేళ 24 వారాల త‌ర్వాత అబార్ష‌న్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే మాత్రం.. కచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ఉండే వైద్య మండ‌లి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. 24 వారాల త‌ర్వాత అబార్ష‌న్ చేస్తే త‌ల్లికి ఎలాంటి ముప్పు ఉండ‌దు.. అని నిర్ధారించిన త‌ర్వాత‌నే ఇందుకు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. కేవ‌లం 3 రోజుల్లోనే అధికారులు అబార్ష‌న్ గురించి సంబంధిత డాక్ట‌ర్‌కు నివేదికను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇదివ‌ర‌కు 12 వారాల లోపు అబార్ష‌న్ చేయిస్తే ఎవ‌రైనా ఒక మెడిక‌ల్ ప్రాక్టిష‌నర్ అనుమ‌తి ఇస్తే స‌రిపోయేది. 12 నుంచి 20 వారాల లోపు అబార్ష‌న్ జ‌రిగితే ఇద్ద‌రు డాక్ట‌ర్ల అనుమ‌తిని తీసుకోవాల్సి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published: