Home /News /national /

GOVT LIKELY TO BEGIN COVID 19 VACCINATION FOR 12 TO 14 AGE GROUP BY MARCH SAYS NTAGI CHIEF DR N K ARORA MKS

Good News: 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు Covid వ్యాక్సిన్లు.. పంపిణీ ఎప్పటి నుంచంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లల కొవిడ్ టీకా డ్రైవ్ పరిధిని విస్తరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకాల పంపిణీని ప్రారంభించే అవకాశం ఉందని ఎన్టీఏజీఐ చీఫ్ డాక్టర్ అరోరా చెప్పారు.

కరోనా మహమ్మారిపై పోరులో భారత్ కీలక మైలురాళ్లను దాటుతోంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై జనవరి 16తో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది జనవరి 10 నుంచి 15 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు కూడా టీకాల పంపిణీ మొదలైన సంగతి తెలిసిందే. కాగా, కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల పాలిట ప్రమాదకారిగా మారడంతో కౌమారదశలోని పిల్లలు అందరికీ వ్యాక్సిన్లు అందించే దిశగా భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పిల్లల కొవిడ్ టీకా డ్రైవ్ పరిధిని విస్తరిస్తూ 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్లు అందించనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి కొవిడ్ 19 ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్.కే అరోరా జాతీయ మీడియాకు కీలక విషయాలను తెలియజేశారు.

పిల్లల కొవిడ్ టీకా డ్రైవ్ పరిధిని విస్తరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకాల పంపిణీని ప్రారంభించే అవకాశం ఉందని ఎన్టీఏజీఐ చీఫ్ డాక్టర్ అరోరా చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని, జనవరి 3నుంచి ఆ ఏజ్ గ్రూప్(15-17) వారికి వ్యాక్సినేషన్ మొదలుకాగా, జనవరి చివరి వారం నాటికి మొత్తం 7.4కోట్ల మందికి టీకాలు అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని, ఇప్పటికే 45 శాతం లక్ష్యం పూర్తయి, 3.31 మంది పిల్లలు టీకాలు పొందారని, ఈ ఏజ్ గ్రూప్ టార్గెట్ పూర్తయిన వెంటనే 12 నుంచి 14 ఏళ్ల వారికీ టీకాలు అందించే పని మొదలవుతుందని డాక్టర్ అరోరా తెలిపారు.

Omicron reinfection : ఒమిక్రాన్ మళ్లీ సోకుతుందా? ఒంట్లో అది లేకుంటే అంతే గతి?



దేశంలో పిల్లలందరికీ భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకానే అందిస్తున్నామని, 15-17 ఏళ్ల వారికి ఫిబ్రవరి తొలి వారం నుంచే రెడో డోసు పంపిణీ కూడా మొదలువుతుందని, అది పూర్తయిన వెంటనే ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని ఎన్టీఏజీఐ చీఫ్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో స్కూళ్లు మూతపడటం, ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపైనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 12-14 ఏజ్ గ్రూప్ కు టీకాల పంపిణీ సత్ఫలితాలనిస్తుందని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు.

kazipet: ఇంతకీ రైల్వే ఆడా, మగా? తండ్రి పేరేంటి? సమాధానాలు చెబితేనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిధులు!



మార్చి నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాల పంపిణీ మొదలుకానుండగా, ఆ తర్వాతి దశలో ఇంకా చిన్నవయసు వాళ్లకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా తీవ్రమైన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉన్నందున వారికి వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిగణించాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్ జోగ్ వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, Covid vaccine, India, Omicron

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు