హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Monkeypox : ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

Monkeypox : ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guidelines For Monkeypox : అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు చేపట్టింది.

Guidelines For Monkeypox : అనేక దేశాల్లో మంకీపాక్స్(Monkeypox) కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా కేంద్రం చర్యలు చేపట్టింది. కేసులను గుర్తించడం, ముందుగానే నివారణా చర్యలు తీసుకోవడం, ఇతరులకు సోకకుండా చూడటం వంటి అంశాల్లో రాష్ట్రాలకు సూచనలు చేసింది. కేసులను త్వరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడవచ్చని కేంద్రం తెలిపింది. అనుమానిత కేసుల శాంపిళ్లను పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన వారిని కనీసం 21 రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచడంతోపాటు, రోగిని చివరగా కలిసిన వ్యక్తిని గుర్తించడంతోపాటు, రోగి వాడిన వస్తువులను దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచాలి. ముఖ్యంగా త్వరగా వ్యాధి సోకే అవకాశం ఉన్నవాళ్లను పేషెంట్లకు దూరంగా ఉంచాలి. రోగి తాకిన వస్తువులకు, రోగి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. కరోనాలాగే రోగిని కలిస్తే జాగ్రత్తగా ఉండాలి. చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్, గ్లోవ్స్ ధరించడం, శానిటైజర్ వాడటం చేయాలి. గర్భిణులను, ఇతర వ్యాధులు ఉన్నవాళ్లను రోగికి దూరంగా ఉంచాలి. పీసీఆర్ టెస్టుల ద్వారా వ్యాధిని గుర్తించాలి. జ్వరం, తలనొప్పి, లింఫ్ నోడ్స్ వాపు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే ముందుగానే జాగ్రత్త వహించాలి. మంకీపాక్స్ సోకితే ఎలాంటి చికిత్స అందించాలో కూడా కేంద్రం పేర్కొంది. దీంతోపాటు విదేశాలకు వెళ్లే వాళ్లకు కూడా పలు సూచనలు చేసింది. అక్కడ రోగులకు, రోగ లక్షణాలు ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే ఎలుకలు, ఉడుతలు, కోతులు వంటి జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.

ALSO READ Viral Video : ట్రాక్టర్ నడుపుకుంటూ పెళ్లి మండపానికి వధువు

అసలేంటీ వైరస్‌?

మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. అంటే మనదేశంలో తట్టు, అమ్మవారిలానే ఇది కూడా కనిపిస్తుంది. ఈ వైరస్‌ను మొదట 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. అందువల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మనుషులకు సోకింది. 1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అందులోనూ ఎక్కువగా ఎలుకలు, చంచులు, ఉడతల నుంచి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. గాలి తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వ్యాధి ఎవరికైనా సోకిన తర్వాత.. శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు 6 నుంచి 13 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 21 రోజులు సమయం తీసుకుంటుంది.

లక్షణాలు (Monkeypox Symptoms)

మంకీపాక్స్ సోకిన వారిలో స్మాల్‌పాక్స్ మాదిరిగానే..ముఖం, కాళ్లుచేతులపై బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వ్యాపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట ఉంటుంది. కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. ఈ వ్యాధి బారినపడిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. తక్కువ మందికి మాత్రమే ప్రాణాపాయంగా ఉంటుంది. ప్రతి 10 మందిలో ఒకరికి మంకీపాక్స్ ప్రాణాంతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు

Published by:Venkaiah Naidu
First published:

Tags: Monkeypox, New Guidelines

ఉత్తమ కథలు