హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ujjwala Scheme: గ్యాస్‌ సిలిండర్‌పై సర్కారు రాయితీ.. ఆ స్కీమ్‌లో ఉన్నవారికి పండగే..

Ujjwala Scheme: గ్యాస్‌ సిలిండర్‌పై సర్కారు రాయితీ.. ఆ స్కీమ్‌లో ఉన్నవారికి పండగే..

ఎల్‌పీజీ సబ్సిడీ

ఎల్‌పీజీ సబ్సిడీ

2016లో మోదీ సర్కారు ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ (పీఎంయూవై)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సబ్సిడీకి సిలిండర్‌ లభిస్తుంది. తాజాగా ఈ రాయితీని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Ujjwala Scheme: సగటు మధ్యతరగతి కుటుంబాన్ని ప్రభావితం చేసే అంశాల్లో గ్యాస్‌ ఒకటి. మన దేశంలో గ్యాస్ ధరలు(Gas sylinder prices) ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. అయితే గ్యాస్‌ ధర పెంచుకుంటూ వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సామాన్యులకు ఓ శుభవార్త చెప్పింది. సింగిల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ(Subsidy on LPG cylinder) ప్రకటించింది. ఉజ్వల పథకం(Ujjwala Scheme) కింద వంట గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తించనుంది. 2016లో మోదీ సర్కారు ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ (పీఎంయూవై)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సబ్సిడీకి సిలిండర్‌ లభిస్తుంది. తాజాగా ఈ రాయితీని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఉజ్వల స్కీమ్తో భారత్‌లో గ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పేద మహిళలకు డిపాజిట్‌ ఫ్రీగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వడంతో పాటు సబ్సిడీ కూడా ఇవ్వడంతో ఈ స్కీమ్‌కు ఆదరణ లభిస్తోంది. 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా 2019-20 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు 20 శాతం మేర లబ్ధిదారులు పెరిగినట్లు తెలుస్తోంది.

* మండిపోతున్న ధరలు

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, యూరప్‌, అమెరికా దేశాల నిర్ణయాలతో అంతర్జాతీయంగా పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. అయిదేళ్లల్లో సుమారు రూ.500 పెరగ్గా ఇప్పుడు ఒక సిలిండర్‌ ధర రూ.1150కు పైగా ఉంది. వీటికి డెలివరీ ఛార్జీలు అదనం. సాధారణ వినియోగదారులకు రూ.10 మాత్రమే సబ్సిడీ వస్తోంది.

Online Gaming Apps: ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై టీడీఎస్..ఏప్రిల్ 1 నుంచి అమలు..!

* సబ్సిడీతో కేంద్రంపై భారం

పేద కుటుంబాలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో వారికి సబ్సిడీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ వెల్లడించారు. ఏడాదిలో 12 వంట గ్యాస్‌ సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2023 మార్చి 1 నాటికి ఈ పథకం కింద దేశంలో సుమారు 9.59 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.200 సబ్సిడీ వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.6,100 కోట్లు భారం పడిందని అన్నారు. మరో ఏడాది పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ భారం మరింత పెరుగుతుందని, పేదల ప్రయోజనమే లక్ష్యంగా మోదీ సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

First published:

Tags: LPG Cylinder, Lpg Cylinder Price

ఉత్తమ కథలు