Home /News /national /

GOVT EXTENDS EMERGENCY CREDIT SCHEME FOR MSMES TILL 31 MARCH 2022 GH VB

Central Government: ఆ స్కీమ్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం.. తాజాగా చేసిన మార్పులివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్న, మధ్యతరహా వ్యాపారాల కోసం రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. కరోనాతో దెబ్బతిన్న వ్యాపారులను ఆదుకునేందుకు గతంలో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్- (ఈసీఎల్​జీఎస్​) స్కీమ్ గడువు పొడిగించింది కేంద్రం. 2022 మార్చి 31 వరకు దరఖాస్తు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
చిన్న, మధ్యతరహా వ్యాపారాల కోసం రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. కరోనాతో దెబ్బతిన్న వ్యాపారులను ఆదుకునేందుకు గతంలో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్- (ఈసీఎల్​జీఎస్​) స్కీమ్ గడువు పొడిగించింది కేంద్రం. 2022 మార్చి 31 వరకు దరఖాస్తు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ స్కీమ్​కు సంబంధించిన గడువును పలుమార్లు పొడిగించిన కేంద్రం.. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఈ స్కీమ్​ కింద రుణాల పంపిణీకి 2022 జూన్ 30 వరకు అవకాశం ఇచ్చింది.

Police: తెల్లవారుజామున 5 గంటలకు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు..! ఎందుకంటే..


అర్హత ఉన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ స్కీమ్ ద్వారా హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం, లీజర్ అండ్ స్పోర్టింగ్ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నవారికి తక్షణమే రుణాలు అందజేస్తామని పేర్కొంది. అందుకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక విండోను సైతం ఓపెన్ చేసింది. ఈ స్కీమ్​లో కొన్ని మార్పులు కూడా చేసింది. అవేంటో చూద్దాం.

YS Sharmila-PK: షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీం భేటీ.. వైఎస్ఆర్‌టీపీకి వ్యూహకర్తగా పీకే..!


ఎంఎస్​ఎంఈ స్కీమ్​లో తాజాగా చేసిన మార్పులు..
1. ఈసిఎల్‌జిఎస్ 1.0 & 2.0 స్కీమ్​ల కింద 2020 ఫిబ్రవరి 29 లేదా 2021 మార్చి 31 నాటికి లోన్లు తీసుకున్న రుణగ్రహీతలు మరో 10% వరకు అదనపు లోన్​కు అర్హత సాధిస్తారు.

2. ఇప్పటివరకు ఈసిఎల్‌జిఎస్ 1.0 & 2.0 కింద సహాయం పొందని వ్యాపారులు, 2021 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలపై మరో 30% వరకు లోన్​ తీసుకోవచ్చు.

Central Government: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..


3. ఈసిఎల్‌జిఎస్ 3.0 కింద పేర్కొన్న సెక్టార్లలోని వ్యాపారాలు లేదా ఇంతకుముందు ఈసిఎల్‌జిఎస్‌ని ఉపయోగించుకోని వారు, 2021 మార్చి 31 నాటికి వారి క్రెడిట్ బకాయిల్లోని 40% వరకు లోన్​ తీసుకోవచ్చు. ఒక్కో రుణగ్రహీత గరిష్టంగా రూ .200 కోట్ల వరకు లోన్​ తీసుకునేందుకు అర్హత ఉంటుంది.

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎండీ సజ్జనార్‌ కీలక నిర్ణయం.. ఏంటంటే..


4. క్రెడిట్​ తేదీని 2020 ఫిబ్రవరి 29 నుంచి 2021 మార్చి 31కి మార్చడం ద్వారా పెరిగిన క్రెడిట్​ లిమిట్​కు అనుగుణంగా అదనపు లోన్​ను తక్షణమే తీసుకోవచ్చు.

5. ఈసీఎల్​జీఎస్​ 1.0, 2.0 కింద ఇదివరకే లోన్ తీసుకున్న వారు కూడా ECLGS 3.0 కింద నిర్దేశించిన క్యాప్‌లో పెరిగిన క్రెడట్​ను తీసుకునేందుకు అర్హత సాధిస్తారు.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 1.15 కోట్ల మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) వ్యాపారాలకు ఎంతగానో ఉపశమనం కలిగించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన వ్యాపార నష్టాన్ని పూడ్చుకునేందుకు, తిరిగి వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఈ స్కీమ్​ ఎంతగానో ఉపయోగపడింది. 2021 సెప్టెంబర్​24 నాటికి కేంద్రం ఈ స్కీమ్ కింద మొత్తం 2.86 లక్షల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం రుణాల్లో 95% సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు మంజూరు చేయడం విశేషం.
Published by:Veera Babu
First published:

Tags: Central Government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు