Home /News /national /

GOVT EMPLOYEES LIKELY TO GET 5PERCENTAGE HIKE IN DEARNESS ALLOWANCE NEXT MONTH UMG GH

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో పెరగనున్న అలవెన్స్‌.. ఎంత పర్సంటేజ్ అంటే..?

5 శాతం పెరగనున్న డీఏ

5 శాతం పెరగనున్న డీఏ

వచ్చే నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ (Central Government Employees)కి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. జులైలో కేంద్రం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance)ని ఐదు శాతం (5 Percent) పెంచే అవకాశముందని మీడియా రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.

ఇంకా చదవండి ...
వచ్చే నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ (Central Government Employees)కి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. జులైలో కేంద్రం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance)ని ఐదు శాతం (5 Percent) పెంచే అవకాశముందని మీడియా రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఏని ఐదు శాతం మేర పెంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. జీవన వ్యయ సూచిక (Cost Of Living Index) ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ ప్రతియేటా రెండుసార్లు అంటే జనవరి, జూలైలో ప్రభుత్వం సవరిస్తుంది. వచ్చే నెల జులై కావడంతో డీఏ పెంపు (DA Hike)కే గవర్నమెంట్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI)లో మార్పుల ఆధారంగా డీఏ సవరించడం జరుగుతుంది. ఏఐసీపీఐ ప్రస్తుతం అధికంగా ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతంగా ఉండటం గమనార్హం. ఈ పర్సంటేజ్ ఆర్‌బీఐ కంఫర్ట్ లెవెల్ కంటే 2-6 శాతం అధికంగా ఉంది. మార్చి నెలలో కేంద్ర మంత్రివర్గం 7వ వేతన సంఘం కింద డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంచడానికి ఆమోదించింది. దాంతో డీఏ ఉద్యోగుల బేసిక్ శాలరీలో 34 శాతానికి చేరుకుంది. ఫలితంగా 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు గతంలో కన్న ఇప్పుడు కాస్త ఎక్కువగా డీఏ పొందుతున్నారు.

వచ్చే నెలలో మరో ఐదు శాతం పెంచితే.. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ 39 శాతానికి పెరుగుతుంది. అప్పుడు రూ.18 వేలు బేసిక్ శాలరీగా ఉంటే.. రూ.7,020 డీఏ లభిస్తుంది. అదే ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డీఏ ప్రకారం చూస్తే రూ.18 వేలు బేసిక్ శాలరీ తీసుకునే వారికి రూ.6,120 డీఏగా లభిస్తుంది. అంటే రూ.900 ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు పొందవచ్చు. అలానే కరోనా కారణంగా జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు ఆగిపోయిన 18 నెలల డీఏ బకాయిలను త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లో కేంద్ర జమ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రూ. 2 లక్షల పెండింగ్ బకాయిలను ఒకేసారి అందుకోవచ్చని తెలుపుతున్నాయి.

7వ పే కమిషన్ కింద డీఏ ఎలా లెక్కిస్తారు?

2006లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను లెక్కించేందుకు వాడే ఫార్ములాను కేంద్రం సవరించింది.

డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్-ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (బేస్ ఇయర్ 2001=100) గత 12 నెలల సగటు -115.76)/115.76)x100 గా ఫార్ములాని కేంద్రం మార్చింది.

సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోసం డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్-ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యావరేజ్ (బేస్ ఇయర్ 2001=100) గత 3 నెలలుగా -126.33)/126.33)x100 గా ఫార్ములాను రివైజ్ చేసింది.
Published by:Mahesh
First published:

Tags: Central govt employees, DA Hike, Employees, Salary Hike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు