Home /News /national /

GOVT CAPS EXPORT OF SUGAR TO ENSURE STOCKS STEPS IN TO COOL EDIBLE OIL PRICES PVN

Sugar Export : మొన్న గోధుమలు..నేడు చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Govt caps export of sugar : ఇటీవల గోధుమల ఎగుమతులను నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెర ఎగుమతులపై కూడా పరిమితులు విధించింది. ద్ర‌వోల్బ‌ణం పెరుగుతోన్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మంగళవారం కేంద్రప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది.

ఇంకా చదవండి ...


Govt caps export of sugar : ఇటీవల గోధుమల ఎగుమతులను నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెర ఎగుమతులపై(Sugar Export) కూడా పరిమితులు విధించింది. ద్ర‌వోల్బ‌ణం పెరుగుతోన్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మంగళవారం కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. విదేశాలకు ఎగుమతి చేయడంతోనే దేశీయంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌తో ముగియనున్న ప్రస్తుత మార్కెటింగ్‌ ఏడాదిలో చక్కెర ఎగుమతులను కోటి టన్నుల వరకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్రం పేర్కొంది. చక్కెర సీజన్ 2021-22 (అక్టోబర్-సెప్టెంబర్)లో దేశంలో చక్కెర దేశీయ లభ్యత మరియు ధర స్థిరత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో జూన్ 1 నుండి చక్కెర ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. చక్కెర ఎగుమతిపై ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయని సమాచారం.

చక్కెర (ముడి, శుద్ధి చేసిన మరియు తెలుపు చక్కెర) ఎగుమతి జూన్ 1 నుండి పరిమితం చేయబడిన కేటగిరీ కింద ఉంచబడుతుంది అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, కొన్ని స‌డ‌లింపుల మ‌ధ్య EU మరియు USలకు చక్కెర ఎగుమతి చేయబడుతోంది. CLX మరియు TRQ కింద ఈ ప్రాంతాలకు నిర్దిష్ట మొత్తంలో చక్కెర ఎగుమతి జ‌రుగుతోంది.

ALSO READ  Pakistan Crisis : పాక్ లో దారుణ పరిస్థితులు..బంకుల్లో నో పెట్రోల్,ఏటీఎంల్లో నో క్యాష్

చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా ఉంటోంది. బ్రెజిల్‌ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉత్పత్తి చేసే చక్కెర.. ఇండోనేషియా, మలేషియా, దుబాయ్‌, ఆఫ్గనిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంది. 2018-19లో 38 లక్షల టన్నుల చక్కెరను భారత్‌ విదేశాలకు ఎగుమతి చేసింది. ఆ తరువాతి సంవత్సరం.. 2019-2020లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 59.60 లక్షల టన్నుల చక్కెరను భారత్‌ ఎగుమతి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నమోదైన చక్కెర ఎగుమతులు 70 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ప్రతీ ఏడాది.. చక్కెర ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతీ సంవత్సరం పెరుగుతున్న చక్కెర ఎగుమతులను నియంత్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడంతో.. దేశీయంగా చక్కెర ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని తెలిపింది.

మరోవైపు,ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నంలో.. ప్రస్తుత మరియు తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో సంవత్సరానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల ముడి సోయాబీన్ మరియు ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను మినహాయించింది కేంద్ర ప్రభుత్వం. మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. మే 25,2022 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. భారత్‌లో వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణ‌యం రావ‌డం గ‌మనార్హం.

ALSO READ Pak Foreign Minister : యాసిన్ మాలిక్ ను రిలీజ్ చేయాలి..UN మానవహక్కుల చీఫ్ కి పాక్ విదేశాంగ మంత్రి లేఖ

కొన్ని రోజుల క్రితం గోధుమల ఎగుమతులపై కళ్లెం వేయడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగిపోయాయి. గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం విషయంలో భారత్‌ మళ్లి ఆలోచించాలని ఐఎంఎఫ్ సహా పలు దేశాలు సూచించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొంత వరకు ఆంక్షలు సడలించినా.. ధరలు మాత్రం అదే స్థాయిలో ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Edible Oil, Exports, Sugar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు