పొగ రాయుళ్లకు షాక్.. ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం

వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: September 18, 2019, 4:01 PM IST
పొగ రాయుళ్లకు షాక్.. ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పొగ రాయుళ్లకు కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించారు. ఈ-సిగరెట్ల తయారీ, ఉత్పత్తి, ఎగమతి, దిగుమతి, రవాణా, అమ్మడం, నిల్వ చేయడం, యాడ్స్ చేయడాన్ని బ్యాన్ చేసినట్లు ఆమె వెల్లడించారు. యువత ఆరోగ్యంపై ఈ-సిగరెట్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్పష్టంచేశారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్లు అమ్మినా, ఎవరి వద్దైనా దొరికినా, దానిపై ప్రచారం చేసినా కఠిన శిక్షలు విధిస్తామని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొదటిసారి తప్పు చేస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. ఇక రెండోసారి తప్పు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. ఎలక్ట్రానిక్ సిగరెట్లతో పాటు ఈ-హుక్కాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం.First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు