Home /News /national /

GOVT BANS 50 MORE CHINESE SMARTPHONE APPS GARENA FREE FIRE MAY BE BANNED TOO IN INDIA REPORT GH VB

Chinese Apps: త్వరలోనే మరో 50 చైనీస్ యాప్స్‌పై నిషేధం.. లిస్ట్​లో గరీనా ఫ్రీ ఫైర్​తో పాటు మరెన్నో పాపులర్​ అప్లికేషన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా మూలాలున్న మరో 50 స్మార్ట్‌ఫోన్ యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, నిషేధిత యాప్‌ల జాబితా అధికారికంగా వెల్లడికానప్పటికీ, ఈటీ నౌ రిపోర్ట ఆయా యాప్​ల పేర్లను పేర్కొంది.

భారత ప్రభుత్వం(Indian Government) 2020 సంవత్సరంలో 270 చైనా యాప్స్‌పై(Apps) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత పౌరుల సమాచార భద్రత, గోప్యతతో సహా దేశసౌర్వభౌమత్వానికి భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, చైనా(China) గుట్టుచప్పుడు కాకుండా తమ దేశ యాప్‌లను ఇండియాలో(India) ప్రవేశపెడుతూనే ఉంది. యాప్ పేర్లను మార్చేసి కొత్త కంపెనీల పేర్లతో వాటిని రన్ చేయిస్తుంది. వీటిపై ఉక్కుపాదం మోపేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. చైనా మూలాలున్న మరో 50 స్మార్ట్‌ఫోన్(Smartphone) యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, నిషేధిత యాప్‌ల జాబితా అధికారికంగా వెల్లడికానప్పటికీ, ఈటీ నౌ రిపోర్ట్ (Report) ఆయా యాప్​ల పేర్లను పేర్కొంది.

ఈ జాబితాలో గరీనా ఫ్రీ ఫైర్ అనే పాపులర్​ స్మార్ట్‌ఫోన్ గేమ్ ఉందని సమాచారం. ఈ యాప్​ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి అదృశ్యమైందని, నిషేధానికి గురైన కొత్త యాప్‌ల లిస్ట్​లో ఈ గేమ్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై గేమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన గరీనా ఇంటర్నేషనల్ నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. కాగా, ఈ గేమ్​ను గూగుల్​ ప్లే స్టోర్​, యాపిల్​ యాప్​ స్టోర్ల నుంచి ఎందుకు తొలగించారనే దానిపై అటు గూగుల్​ గానీ, యాపిల్ గానీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.

JPL- SES Joint Venture: రిలయన్స్ జియో కొత్త ఒప్పందం.. లక్సెంబర్గ్‌కు చెందిన SES కంపెనీతో శాటిలైట్ జాయింట్ వెంచర్..


యాప్​ స్టోర్ల నుంచి అదృశ్యమైన గరీనా ఫ్రీ ఫైర్..​
ప్రస్తుతం బ్యాన్​ అయిన యాప్‌ల పూర్తి జాబితా గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈటీ నౌ నివేదిక ప్రకారం, నిషేధిత యాప్‌ల కొత్త జాబితాలో 2020లో బ్యాన్​ అయిన యాప్‌లకు చెందిన క్లోన్‌ యాప్​లు ఎక్కువగా ఉన్నాయి. తాజా నిర్ణయంతో భారతదేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం బ్యాన్​ చేసిన యాప్​ల సంఖ్య 320కి చేరుకుంటుంది. టిక్​టాక్​, పబ్జీ మొబైల్‌తో సహా అనేక ప్రసిద్ధ యాప్‌లను భారత ప్రభుత్వం గతంలో నిషేధించింది.

Whatsapp Features: వాట్స‌ప్‌లో క్రేజీ అప్‌డేట్‌.. కొత్త ఫీచ‌ర్ గురించి తెలుసుకోండి!

దీంతో, పబ్జీ మొబైల్ ఇండియా దాని చైనీస్ భాగస్వాములతో సంబంధాలను తెంచుకొని భారతదేశంలో తిరిగి ప్రవేశించింది. క్రాఫ్టన్​ సంస్థ బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా పేరుతో దీన్ని విడుదల చేసింది. కాగా, చైనాకు చెందిన పాపులర్​ వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​పై బ్యాన్​​ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిషేధానికి గురైన యాప్‌ల కొత్త జాబితాలో చైనా మూలాలు ఉన్న నకిలీ యాప్స్​ కూడా ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: China, China Products, Garena, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు