దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 చానళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డిసెంబర్లో ప్రకటించింది. ఈ చానల్, వెబ్సైట్ బ్లాక్‌ను సమర్థిస్తూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ (Minister Anurag Thakur) మాట్లాడారు. యూట్యూబ్ చానెల్ (YouTube Channel) లకు, వెబ్సైట్లకు దేశ భద్రత, గౌరవానికి సంబంధించిన అంశంపై రూల్స్ కఠినంగానే ఉంటాయని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "నేను వారిపై (యూట్యూబ్, వెబ్సైట్లు) చర్యకు ఆదేశించాను.. ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద దేశాలు దీనిని గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను. యూట్యూబ్ కూడా ముందుకు వచ్చి వారిని బ్లాక్ చేసేలా చర్యయలు తీసుకుంది, ”అని ఠాకూర్ అన్నారు.
Assembly Election 2022: ప్రచారంలో నయా ట్రెండ్.. ఐదు రాష్ట్రాల్లో పార్టీలు ఏం చేస్తున్నాయంటే..
ఎందుకు బ్యాన్ చేశారు..
ఇంటర్నెట్ (Internet)లో దేశంపై వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తల (Fake News) ఛానెల్‌లు, రెండు వెబ్సైట్లను బ్లాక్ చేసింది. ఈ సందర్భంగా.. ఛానెల్‌లు పోస్ట్ చేసిన చాలా కంటెంట్ "జాతీయ భద్రత కోణం నుంచి సున్నితమైన విషయాలకు సంబంధించినది. వాస్తవంగా తప్పు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యూట్యూబ్ ఛానెల్‌లు, వెబ్సైట్లను బ్లాక్ చేయాలనే నిర్ణయంపై మంత్రిత్వ శాఖ నిఘా సంస్థలతో చర్చించింది.
బ్లాక్ చేయబడిన ఛానెల్‌లు, వెబ్సైట్లు పాకిస్తాన్ (Pakistan) సమన్వయంతో కూడిన తప్పుడు సమాచార నెట్‌వర్క్‌కు చెందినవిగా గుర్తించారు. దేశంలో అశాంతి కలిగించే.. కాశ్మీర్, భారత సైన్యం, రామమందిరం (Ram Mandir), మైనారిటీ సంఘాలు, సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు భారతదేశానికి సంబంధించిన ఇతర వివిధ సున్నితమైన విషయాలపై వ్యతిరేకతను పెంచేలా కంటెంట్‌ను పోస్ట్ చేసేవనిగా మంత్రిత్వ శాఖ తెలిపింది. అందుకే వాటిన బ్యాన్ చేశారు.
దీనిపై గూగుల్ (Google) యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు యూట్యూబ్ చర్యలు చేపట్టింది. ఐటీ చట్టం 2021 (IT act 2021) ప్రకారం చర్యలు తీసుకున్నది. వీటితో పాటు రెండు వెబ్సైట్లను సైతం నిషేధించారు.
PM Narendra Modi: టీనేజ్ వ్యాక్సినేషన్‌పై మోదీ ట్వీట్.. ఎంతమందికి ఇచ్చారంటే!
"భవిష్యత్తులో కూడా, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు, అసత్యాలు వ్యాప్తి చేయడం మరియు సమాజాన్ని విభజించే అటువంటి ఖాతాలను బ్లాక్ చేసే దిశగా చర్యలు తీసుకొంటామని" అని ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Fake news, National News, Pakistan, Website, Youtube