రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌‌ న్యూస్.. దసరా బోనస్ ఎంతంటే..

గత ఆరేళ్లుగా ప్రొడక్టివిటీ బోనస్‌‌ను నిలకడగా అందిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. భారతీయ రైల్వే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందున ఉద్యోగులకు ఈ కానుక ఇస్తున్నామని ఆయన చెప్పారు.

news18-telugu
Updated: September 27, 2019, 11:20 AM IST
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌‌ న్యూస్.. దసరా బోనస్ ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని కేంద్ర మంత్రి మండలి బుధవారం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో 11.52 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో కేంద్రంపై రూ.2వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది. గత ఆరేళ్లుగా ప్రొడక్టివిటీ బోనస్‌‌ను నిలకడగా అందిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. భారతీయ రైల్వే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందున ఉద్యోగులకు ఈ కానుక ఇస్తున్నామని ఆయన చెప్పారు.First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>