రోజూ 9 గంటలు పని? ఉద్యోగులకు షాక్?

Delhi : ప్రభుత్వ ఉద్యోగులకు ఏ మాత్రం నచ్చని ఓ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అమల్లోకి వస్తే... ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది తేలాల్సిన అంశం.

news18-telugu
Updated: November 19, 2019, 7:38 AM IST
రోజూ 9 గంటలు పని? ఉద్యోగులకు షాక్?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Delhi : చల్లటి ప్రదేశాల్లో రోజుకు 10 గంటలు పనిచేసినా అలసట రాదు. అదే ఎండ ఉండే ఇండియా లాంటి దేశంలో... రోజుకు 8 గంటలు పనిచెయ్యాలన్నా శారీరక, మానసిక అలసట తప్పదు. ఏసీలు వేసుకొని పని చేసినా... శరీర అలసట మాత్రం పోదు. అందుకే... మన దేశంలో... రోజువారీ పని గంటలను 8గా నిర్ణయించారు. వారంలో 6 రోజులు వర్కింగ్ డేగా పెట్టి... వారానికి 48 గంటలు పనిచెయ్యాలనే కండీషన్ ఉంది. ఐతే... కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ మార్చాలని అనుకుంటోంది. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికుల పనిగంటలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న 8 గంటల్ని 9 గంటలుగా మార్చుతారని తెలిసింది. వేతన కోడ్‌-2019 డ్రాఫ్ట్‌ని రిలీజ్ చేసిన కేంద్రం... ఉద్యోగుల కనీస జీతం, DA, పనిగంటలు, కార్మిక హక్కుల రూల్స్ అందులో తెలిపింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు, కార్మికులు తమ అభిప్రాయాల్ని తెలిపేందుకు ఓ వీలు ఉంది. ఈ నెలాఖరులోగా rajiv.ranja76@gov.in, malick.bikash@gov.in ఈ-మెయిళ్లకు తమ అభిప్రాయాలు పంపొచ్చు. పని గంటలు పెంచినంత మాత్రాన శాలరీలు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. అందువల్ల కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. వారి అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకొని కేంద్రం ఫైనల్ నిర్ణయం తీసుకునే వీలుంది.

 

Pics : కేతిక శర్మ అందాల వర్షంలో తడిసి ముద్దైపోవాల్సిందే
ఇవి కూడా చదవండి :

ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె విరమించే ఛాన్స్...ఒక్కటవుతున్న రాహుల్, పునర్నవి... ఎక్కడో తెలుసా?

బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?

సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి

గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...
First published: November 19, 2019, 7:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading