ఈఎస్ఐ విషయంలో కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం..

ESI News | ప్రస్తుతం ఈఎస్ఐను 6.5 శాతం ఉంది. యజమాని వాటా 4.75 శాతం, ఉద్యోగి వాటా 1.75శాతం. అయితే, దీన్ని మార్చి 4 శాతానికి ఫిక్స్ చేశారు.

news18-telugu
Updated: June 13, 2019, 9:48 PM IST
ఈఎస్ఐ విషయంలో కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈఎస్ఐ కంట్రిబ్యూషన్‌కు సంబందించి కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ కంట్రిబ్యూషన్‌ను 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. (యజమాని వాటాను 4.75శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించారు. ఉద్యోగులకు 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గించారు). కేంద్రం కొత్త నిర్ణయం జూలై 1, 2019 నుంచి అమల్లోకి రానుంది. దీని వలన 3.6 కోట్ల మంది ఉద్యోగులు, 12.85లక్షల కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈఎస్ఐ కంట్రిబ్యూషన్‌ను తగ్గించడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు మేలు జరగడమే కాకుండా మరింత మంది ఈఎస్ఐ స్కీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఎంప్లాయర్ షేర్‌ కూడా తగ్గించడం వల్ల కంపెనీలకు ఆర్థిక భారం తగ్గుతుంది. దీని వల్ల కంపెనీని విస్తరించేందుకు, మరికొంత మందికి ఉపాధి కల్పించేందుకు బాటలు వేసినట్టు అవుతుంది. సులభతర వాణిజ్యానికి కూడా ఊతం ఇచ్చినట్టు అవుతుంది. వీటితోపాటు ఈఎస్ఐకి సంబంధించిన ఫిర్యాదులు కూడా తగ్గుతాయని, చట్టం మరింత పకడ్బందీగా అమలు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

ఈఎస్ఐ చట్టం ప్రకారం ఉద్యోగి, యజమాని తమ వాటాను చెల్లిస్తారు. కేంద్రం కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆ నిధిని నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈఎస్ఐ 6.5 శాతం ఉంది. 1997 నుంచి ఇది అమలవుతోంది. ఆ 6.5 శాతంలో యజమాని వాటా 4.75 శాతం, ఉద్యోగి వాటా 1.75శాతం. అయితే, దీన్ని మార్చి 4 శాతానికి ఫిక్స్ చేశారు. అలాగే, గతంలో రూ.15,000 లోపు వేతనం ఉన్నవారికే ఈఎస్ఐ వర్తించేది. దాన్ని రూ.21,000 లోపు వేతనం ఉన్న వారికి కూడా వర్తింపజేస్తూ 2017లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading