Covid vaccine guidelines: వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్.. జూన్ 21 నుంచి అమలు

Covid vaccine guidelines: వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త గైడ్‌లైన్స్.. జూన్ 21 నుంచి అమలు

Covid vaccine: దేశ ప్రజలకు ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... వ్యాక్సిన్ల కార్యక్రమంపై కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. అవేంటో... రాష్ట్రాలకు ఏం సూచించిందో తెలుసుకుందాం.

  • Share this:
    Covid vaccine: రాష్ట్రాల ప్రభుత్వాలు తాము వ్యాక్సిన్లను పొందలేకపోతున్నామనీ... కొందామన్నా అవి లభించట్లేదనీ... తమ ప్రజలకు వ్యాక్సిన్లు వెయ్యలేకపోతున్నామని అంటుంటే... ఆ ప్రభావం జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై పడుతోంది. రోజూ 30 లక్షల మందికి మించి వ్యాక్సిన్ వెయ్యలేకపోతున్నారు. ఇక గ్రామాల్లో అయితే... అసలు వ్యాక్సినే అందట్లేదు. అక్కడి ప్రైవేట్ ఆస్పత్రులు సైతం... ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు... వివిధ రాష్ట్రాల్లో మే 1 నుంచి వచ్చిన వినతులు, రిక్వెస్టులను లెక్కలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం... జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించి... మార్పులు చేసి... కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఇవి జూన్ 21 నుంచి అమల్లోకి వస్తాయి. అవి ఏంటో చూద్దాం.

    Revised Guidelines:
    - కేంద్ర ప్రభుత్వం... దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం ప్రొక్యూర్ చేస్తుంది. వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇస్తుంది. వాటిని రాష్ట్రాల ప్రభుత్వాలు... ప్రజలకు... ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఉచితంగా ఇవ్వాలి.

    వ్యాక్సిన్ ఇచ్చే ముందు ఈ ప్రాధాన్య క్రమం పాటించాలి.
    o హెల్త్ కేర్ వర్కర్లు
    o ఫ్రంట్ లైన్ వర్కర్లు
    o 45 ఏళ్లు దాటిన వాళ్లు
    o రెండో డోసు పెండింగ్ ఉన్నవారు
    o 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారు

    18 ఏళ్లు దాటిన వారి విషయంలో... ఎవరికి ముందుగా వెయ్యాలి... అనే ప్రాధాన్య క్రమాన్ని రాష్ట్రాలు తయారుచేసుకోవచ్చు.

    ఏ రాష్ట్రాలకు ఎన్ని వ్యాక్సిన్లను ఇవ్వాలి అనే అంశాన్ని... రాష్ట్రాల్లో జనాభా, కరోనా వ్యాప్తి, ఇప్పటివరకూ జరిగిన వ్యాక్సినేషన్, వేస్ట్ అయిన వ్యాక్సిన్లు అన్నీ లెక్కలోకి తీసుకొని కేంద్రం నిర్ణయిస్తుంది.

    ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చేదీ... ఎప్పటికప్పుడు ముందుగానే కేంద్రం సమాచారం ఇస్తుంది. దానికి అనుగుణంగా... రాష్ట్రాలు... జిల్లాలకు ముందుగానే సమాచారం ఇవ్వాలి. అలాగే... జిల్లాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఎక్కడ ఎన్ని వ్యాక్సిన్లు లభిస్తాయో... ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలపాలి. వ్యాక్సిన్ల లభ్యత, ఎక్కడ లభిస్తాయో ప్రజల్లో బాగా అవగాహన కలిగించాలి.

    దేశంలో వ్యాక్సిన్ తయారీ కంపెనీలు... నెలలో చేసిన ఉత్పత్తిలో 25 శాతాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకోవచ్చు. పెద్ద, చిన్న ఆస్పత్రులను బ్యాలెన్స్ చేసుకుంటూ... అందరికీ అమ్ముకోవాలి. ఇలా అమ్మేందుకు కేంద్రం.. నేషనల్ హెల్త్ అథార్టీకి చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనుంది. ఈ అథార్టీ ద్వారా ఆస్పత్రులు చెల్లింపులు చేస్తాయి. శివారు ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా వ్యాక్సిన్లు చేరేలా చెయ్యాలని కేంద్రం చెబుతోంది.

    ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సన్ డోస్ ధర ఎంత అనేది వ్యాక్సిన్లు తయారుచేసే కంపెనీలే ప్రకటించాలి. ఏవైనా మార్పులు ఉంటే.. ముందే చెప్పాలి.

    ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ వేసినందుకు... సర్వీస్ ఛార్జీల కింద డోసుకు రూ.150కి మించి తీసుకోకూడదు. ఈ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ ఉండాలి.

    దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితమే. ఎవరైనా డబ్బు చెల్లించి వ్యాక్సిన్ వేసుకోగలం అనుకుంటే... అలాంటి వారు ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వేయించుకోవచ్చు. అలాంటి వారికి నాన్-ట్రాన్స్ఫరబుల్ ఎలక్ట్రానిక్ వోచర్ ఇస్తారు.

    ఇది కూడా చదవండి: Vastu tips: కొత్తగా పెళ్లైందా... ఐతే... బెడ్‌రూమ్ ఇలా ఉండాలి... ప్రతి రోజూ పండగే...

    కోవిన్ (CoWIN) యాప్ ద్వారా దేశ ప్రజలు ముందుగానే వ్యాక్సిన్ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. లేదా... వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లినప్పుడు... అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు విడుదల చేస్తాయి. అలాగే కామన్ సర్వీస్ సెంటర్లు, కాల్ సెంటర్ల సేవల్ని కూడా రాష్ట్రాలు ముందస్తు బుకింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: