మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇంటి వద్దకే మద్యం..

మద్యం దుకాణాల వద్ద లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న క్రమంలో వైన్, బీరుతో సహా అన్ని స్వదేశీ, విదేశీ బ్రాండ్లను ఇంటికే సరఫరా చేసేందుకు నిర్ణయించింది.

news18-telugu
Updated: May 13, 2020, 10:27 AM IST
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఇంటి వద్దకే మద్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్ నిబంధనలకు కొంతమేర ఇచ్చిన సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు భౌతిక దూరాన్ని పాటించడం విస్మరిస్తున్నారు. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల వద్ద లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న క్రమంలో వైన్, బీరుతో సహా అన్ని స్వదేశీ, విదేశీ బ్రాండ్లను ఇంటికే సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అయితే ఈ అవకాశాన్ని లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలకు మాత్రమే కల్పించింది. ఇప్పటికే మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు రూపొందించింది. ఏదైనా మద్యం దుకాణం పరిధి వరకు మాత్రమే ఆ దుకాణం వారు హోం డెలివరీ చేసేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో పాటు డెలివరీ బాయ్స్ ఖచ్చితంగా మాస్కు ధరించడంతో పాటు తరచూ హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలని సూచించింది. ముందుగా నిర్దేశించిన రోజుల్లో మాత్రమే మద్యాన్ని సరఫరా చేసేందుకు అనుమతి ఉంటుంది. కాగా, లాక్‌డౌన్ ముగిసేంత వరకు హోం డెలివరీ అవకాశం కల్పించారు.
First published: May 13, 2020, 10:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading