ఆవుల కోసం ప్రత్యేక అభయారణ్యాలు...ఆరు నెలల్లోగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటుకు సన్నాహాలు...

ప్రతీకాత్మ చిత్రం

ఆవుల సంరక్షణ కోసం ఏర్పాటు అభయారణ్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. రానున్న ఆరునెలల్లో అన్ని రాష్ట్రాల్లో ఆవుల కోసం వందలాది ఎకరాల విస్తీర్ణంలో భూములను సేకరించి అభయారణ్యాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేక అభయారణ్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ పులులు, ఇతర వన్యప్రాణులకు మాత్రమే అభయారణ్యాలు ఉన్నాయి. అయితే ఆవుల సంరక్షణ కోసం ఏర్పాటు అభయారణ్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. రానున్న ఆరునెలల్లో అన్ని రాష్ట్రాల్లో ఆవుల కోసం వందలాది ఎకరాల విస్తీర్ణంలో భూములను సేకరించి అభయారణ్యాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైతే ఆవుల కోసం అభయారణ్యాలు ఏర్పాటు చేస్తాయో, వారికి కోటిన్నర నుంచి రెండు కోట్లు తమ నిధులను అందిస్తామని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ వల్లభ కథిరియా తెలిపారు. అంతేకాదు ఒక్కో అభయారణ్యంలో రెండు వేల వరకూ ఎద్దులను సైతం స్వేచ్ఛగా వదిలేందుకు సహకరిస్తామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆవుల కోసం షెడ్స్, మేనేజర్ల కోసం క్వార్టర్స్ సైతం ఈ అభయారణ్యాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    అభయారణ్యాల ద్వారా పచ్చదనం అభివృద్ధి చేయడంతో పాటు అంతరించిపోతున్న గో జాతులను సంరక్షించే ప్రయత్నం చేస్తామని సంస్థ ఛైర్మన్ కథిరియా తెలిపారు. అంతేకాదు గోవులను దత్తత ద్వారా నిధుల సేకరణ చేపడతామని, అలాగే ఆవుల అభయారణ్యాల్లో గో ఆధారిత ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి ఆ నిధులతో అభయారణ్యాల నిర్వహణ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉంటే గోవుల సంరక్షణ కోసం అభయారణ్యాలు ఏర్పాటు చేసేందుకు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందుకు వచ్చాయి.
    First published: