ప్లాస్టిక్ నిషేధంపై కేంద్రం ఫోకస్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి ఆదేశాలు వెళ్తాయా?

దేశంలో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో... ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం... ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. రకరకాల కాలుష్యాలకు కారణమవుతున్న ప్లాస్టిక్‌ను అక్టోబర్ 2 నుంచీ నిషేధించే అవకాశాలున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 11:01 AM IST
ప్లాస్టిక్ నిషేధంపై కేంద్రం ఫోకస్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కి ఆదేశాలు వెళ్తాయా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్లలో ఏదైనా వస్తువు కొని ఉంటే... ఆ వస్తువుకి ఐదారు రెట్లు ఎక్కువగా ప్యాకింగ్ ఉంటుంది. సపోజ్ మీరు ఓ మొబైల్ కొని ఉంటే... హ్యాండ్ సెట్ బాక్స్‌తోపాటూ... దాని చుట్టూ ప్లాస్టిక్ కవర్... ఆ కవర్‌పై అట్ట పెట్టె... ఆ పెట్టెపై... టేప్... ఇలా ప్యాకింగ్‌ కోసం చాలా హంగామా ఉంటుంది. దీని వల్ల చాలా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పోగవుతున్నాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం... ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతవరకూ తగ్గించాలని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీలను కోరే అవకాశాలున్నాయి. కేంద్రం ప్లాన్ ఏంటంటే... ప్లాస్టిక్ వ్యర్థాలతో మరిన్ని రోడ్లు నిర్మించాలనుకుంటోంది. ఇదే అంశాన్ని ఆగస్ట్ 15 నాడు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ప్రస్తుతం ప్లాస్టిక్ కణాలు... గాలిలో, ఇళ్లలో ప్రతి చోటా ఉంటున్నాయి. ఇటీవల భూమికి 36వేల అడుగుల లోతున... మారియానా ట్రెంచ్‌లో కూడా ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజు నాడు.... కేంద్రం ప్లాస్టిక్ మిషన్ ప్రారంభించబోతోంది. దాని ద్వారా... దేశంలోని వృథా ప్లాస్టిక్‌ను సేకరించి, విభజించి... రీసైక్లింగ్ చెయ్యనుంది. దేశంలో రోజూ 15వేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ తయారవుతోంది. అందులో 9వేల టన్నులను మనం సేకరించగలుగుతున్నాం. మిగతాది సముద్రాలు, డ్రైనేజీల్లోకి చేరుతోంది. ఈ వేస్ట్ ప్లాస్టిక్‌లో 40 శాతం... వాడి పారేస్తున్న టీ కప్పులు, పాలిథిన్ కవర్లు, స్ట్రాల వంటివే ఉంటున్నాయి. ఇవి సేకరణకు దక్కకుండా... డ్రైనేజీలు, వాగులు, చెరువులు, నదులు, సముద్రాల్లో తిష్టవేస్తున్నాయి.

అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు... స్కూళ్లు, కాలేజీలు, మున్సిపాలిటీలు, పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలూ... అందరూ... సింగిల్ యాజ్ ప్లాస్టిక్ కవర్లను పోగేయాలని ప్రధాని కోరారు. అంతేకాదు... సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపేద్దామని పిలుపిచ్చారు. ప్రధాని ప్లాన్ ఎలా అమలు చెయ్యాలనే అంశంపై గురువారం ఢిల్లీలో ఓ హై లెవెల్ మీటింగ్ జరిగింది. కేంద్రం ఈ దిశగా కొత్త రూల్స్ తేవాలని అధికారులు నిర్ణయించారు. స్టైరోఫామ్ కప్పులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, డిస్పోజబుల్ ప్లాస్టిక్ కర్ట్‌లెరీ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను ముందుగా స్వచ్ఛందంగా నిషేధించి, ఆ తర్వాత కఠినంగా నిషేధం అమలుచేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకూ దేశంలో రూరల్ రోడ్స్ ప్రోగ్రామ్ ద్వారా... గ్రామాల్లో 10 వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. వాటిలో 15 శాతం రోడ్లను ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించారు. ఈ శాతాన్ని 25కి పెంచాలనే టార్గెట్ ఉంది. ఓవరాల్‌గా 2022 నాటికి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలనే టార్గెట్ ఉంది. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామంటున్న ఫ్లిప్‌కార్ట్... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
Published by: Krishna Kumar N
First published: August 24, 2019, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading