ప్రజలారా ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. కరోనా సమాచారం కోసం ఇక్కడ చదవండి..

కరోనా వైరస్‌పై ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సోషల్ మీడియాతో సహా అన్ని మాధ్యమాల్లో ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు రంగంలోకి దూకింది.

news18-telugu
Updated: April 1, 2020, 3:03 PM IST
ప్రజలారా ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. కరోనా సమాచారం కోసం ఇక్కడ చదవండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌పై ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సోషల్ మీడియాతో సహా అన్ని మాధ్యమాల్లో ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు రంగంలోకి దూకింది. తప్పుడు సమాచారంతో ప్రజలు మోసపోవద్దన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అప్‌డేట్స్ కోసం ఒక ట్విట్టర్ ఖాతాను తెరిచింది. #IndiaFightsCoronaతో ట్విట్టర్‌లో ఖాతాను ఓపెన్ చేసింది. @COVIDNewsByMIB అడ్రస్‌‌ను ట్విట్టర్ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేేసి, ఖాతాను తెరవొచ్చు. ఈ ఖాతాను ఫాలో అయితే సరి.. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, కరోనాపై అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు. ఈ ఖాతాలో 24గంటలు కొవిడ్‌ సమాచారాన్ని అందించే సహాయ కేంద్రాల ఫోన్‌ నెంబర్లను ట్వీట్‌ చేశారు.



కాగా.. మీడియా, ప్రింట్, సోషల్ మీడియాకు బాధ్యత ఉందన్న సుప్రీంకోర్టు... ప్రజల్లో భయాందోళనలు కలిగించకుండా చెయ్యాలని కోరింది. ఇది మీడియా స్వేచ్ఛను హరించినట్లు కాదన్న సుప్రీంకోర్టు... కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని... సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇకపై ప్రతి 24 గంటలకు ఓసారైనా అధికారిక సమాచారాన్ని మీడియాకూ, సోషల్ మీడియాకూ రిలీజ్ చెయ్యాలని కోరింది.
First published: April 1, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading