Parents Begging For Son Dead Body : బీహార్(Bihar)లో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బు చెల్లించలేదని చెబుతూ మృతదేహాన్ని(Dead Body)ఇవ్వకుండా ఓ ఆస్పత్రి యాజమాన్యం కర్కశంగా వ్యవహరించింది. కుమారుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ఆసుపత్రి సిబ్బంది రూ. 50,000 డిమాండ్ చేయడంతో నిస్సహాయులైన తల్లిదండ్రులు తమ వద్ద డబ్బులు లేవని, తన కుమారుడి మృతదేహానికి డబ్బు జమ చేయాలని జోలె పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ డబ్బుల కోసం అర్థించారు. బీహార్ లోని సమస్తిపూర్‌లో ఈ ఘటన జరిగింది.
బీహార్ లోని సమస్తిపూర్(Samastipur)లో నివసించే మహేష్ ఠాకూర్ దంపతుల కుమారుడు కొంతకాలంగా నా కొడుకు కనిపించకుండా పోయాడు. చాలా రోజులుగా కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే తాజాగా కనిపించకుండా పోయిన కుమారుడి మృతదేహం సమస్తిపూర్‌లోని సదర్ హాస్పిటల్ లో ఉందని మహేష్ ఠాకూర్ కి కాల్ వచ్చింది. దీంతో కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చుకునేందుకు మహేష్ ఠాకూర్ దంపతులు హాస్పిటల్ కి వెళ్లారు. కొడుకు మృతదేహాన్ని అప్పగించేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. వైద్య ఖర్చుల కింద రూ.50 వేల వరకు అయ్యాయని.. డబ్బులు కట్టి కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాలని సదరు ఆస్పత్రి సిబ్బంది సూచించారు. అంత డబ్బు కట్టే స్థోమత లేని తల్లిదండ్రులు వాపోయారు. నా కుమారుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ఓ ఆసుపత్రి ఉద్యోగి రూ.50 వేలు డిమాండ్ చేశాడు. మేం పేదవాళ్లం, ఇంత మొత్తం ఎలా ఇస్తాం? అంటూ మహేష్ ఠాకూర్ కన్నీటిపర్యంతమయ్యారు.
Viral Video : రాంగ్ రూట్ లో ట్రిపుల్ డ్రైవింగ్..అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ పై పరుగెత్తించి మరీ దాడి!
కుమారుడి మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకునేందుకు తల్లిదండ్రులు జోలె పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ డబ్బుల కోసం అర్థించారు. ఆ తల్లిదండ్రుల బాధను చూసి చలించిన ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేశారు. ఆ తల్లిదండ్రుల హృదయ విధాకర ఘటనన చూసిన ప్రతి ఒక్కరూ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 వేల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులకు కొడుకు మృతదేహాన్ని ఇవ్వకుండా నరకం చూపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయం గురించి ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందింది. సమస్తిపూర్ సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్కే చౌదరి మాట్లాడుతూ.. ఈ విషయంలో కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.