హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

చిన్నారి పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ఇంజిన్ కింద చిక్కుకొని..

చిన్నారి పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ఇంజిన్ కింద చిక్కుకొని..

రైలు ఇంజిన్ కింద చిక్కుకున్న బాలుడు

రైలు ఇంజిన్ కింద చిక్కుకున్న బాలుడు

చిన్నారి మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎంతో సాహసం, సమయస్ఫూర్తితో బాబను కాపాడిన లోకో పైలట్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

పట్టాలపై గూడ్స్ రైలు పరుగులు పెడుతోంది. ఇద్దరు లోకో పైలట్‌లు రైలును కంట్రోల్ చేస్తూనే కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంత దూరంలో ఓ పిల్లాడు పట్టాలపై ఆడుకుంటూ కనిపించాడు. హారన్ గట్టిగా మోగించినా పక్కకు తప్పుకోలేదు. అతడిని ఎలాగైనా కాపాడాలని ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు లోకో పైలట్లు. ట్రైన్ కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. కానీ అప్పటికే బాబు మీద నుంచి వెళ్లిపోయింది. రైలు ఆగిన వెంటనే ఇంజిన్ నుంచి ఇద్దరు లోకో పైలట్లు దిగి పట్టాలను పరిశీలించారు. ఇంజిన్ కింది భాగంలో చిక్కుకుపోయిన పిల్లాడు.. ఏడుస్తూ.. భయపడుతూ కనిపించాడు. అంతేతప్ప ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగానే ఉన్నాడు. ఇంజిన్ కింద భాగంలో ఉండిపోయిన బాలుడిని లోకో పైలట్లు చాకచాక్యంగా బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాబ్‌గఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్లు బాలుడు రెండేళ్ల తన తమ్ముడితో కలిసి ఆడుకున్నాడు. ఆ తర్వాత అతడు వెళ్లిపోవడంతో.. రెండేళ్ల బాలుడు నడుచుకుంటూ పట్టాలపైకి చేరుకున్నాడు. అదే సమయంలో రైలు దూసుకొచ్చింది. లోకో పైట్ల ధీవన్, అతుల్ చాకచక్యంగా బ్రేకులు వేయంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఐతే రైలు ఆగిన తర్వాత ఆ బాబు భయంతో బిగ్గరగా ఏడ్చాడని.. ముందు అతడి ఊరుకోబెట్టి, ఆ తర్వాత జాగ్రత్తగా ఇంజిన్ కింద నుంచి బయటకు తీసుకొచ్చినట్లు లోకో పైలట్లు తెలిపారు. మొత్తానికి ఆ చిన్నారి మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎంతో సాహసం, సమయస్ఫూర్తితో బాబను కాపాడిన లోకో పైలట్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారిద్దరికి డివిజనల్ రైల్వే మేనేజర్ రివార్డు అందజేశారు.

First published:

Tags: Haryana, Indian Railways

ఉత్తమ కథలు