అయోధ్య రామజన్మభూమికి సంబంధించి త్వరలో దేశ ప్రజలు శుభవార్త వింటారని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా నాశిక్‌లో శ్రీశ్రీ రవిశంకర్ ఓ మెడిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవిశంకర్.. త్వరలో ప్రజలు గుడ్ న్యూస్ వింటారని చెప్పారు. అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వివాదానికి సంబంధించి ఏర్పాటు చేసిన ముగ్గురు మధ్యవర్తుల్లో శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఒకరు. అయితే, త్రిసభ్య కమిటీ చర్చలు జరిపింది. కానీ, పరిష్కారం కాలేదు. మళ్లీ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆ లోపే దీనిపై తీర్పును వెలువరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir, Supreme Court