ప్రాణాలు కాపాడే సంజీవనిలా గుర్తొస్తుంది ఎవరికైనా. ఆపదలో ఉన్నవారు వెంటనే కాల్ చేసేది అంబులెన్స్ నంబరుకే. ఆపద వేళలో ఆపద్భాంధవునిగా సేవలు అందించేవి అంబులెన్స్‌లే.. అయితే రోడ్డుపై రయ్ రయ్ అంటూ వేగంగా వచ్చి పేషెంట్‌ను సకాలంలో ఆస్పత్రిలో చేర్చే అంబులెన్స్‌ను నది దగ్గర నివసిస్తున్న వాళ్ల దగ్గరకు మాత్రం వెళ్లడానికి నానాపాట్లు పడాల్సి వస్తుంది. ఎందుకంటే సరైన రోడ్డు మార్గాలే అక్కడ ఉండవు కాబట్టి.. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.. టైమ్‌కి అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో.. నదీ ప్రాంతాల్లో ఉండే వారు ప్రాణాలు పొగొట్టుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ సమస్య ఎన్నో ఏళ్లుగా అలానే కంటిన్యూ అవుతుండగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే ఐడియాతో ముందుకొచ్చింది.
నదిలో అంబులెన్స్:
మధ్యప్రదేశ్ వైద్య రంగంలో కొత్త ముందడుగు పడింది. ఇకపై నర్మదా నదిలో కూడా అంబులెన్స్‌లు నడపనున్నాయి. కక్రానా నుంచి నడిచే ఈ అంబులెన్స్‌ను నర్మదా సమగ్ర సంస్థ నడుపుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చికిత్స అందేలా ఈ ఐడియాకు రూపకల్పన చేసింది. నది గుండా నడిచే అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స, పది ఆక్సిజన్ సిలిండర్లు, కిట్లు, అవసరమైన మందులు ఉంటాయి. బుధ, గురువారాల్లో అంబులెన్సులు ధార్ జిల్లా ఒడ్డున ఉంటాయి. శుక్రవారం అలీరాజ్ పూర్ జిల్లాలో, ఆదివారం సర్దార్ సరోవర్ బ్యాక్ వాటర్ గ్రామాల్లో ఈ రివర్ అంబులెన్స్‌ను నడపనున్నారు. సకాలంలో వైద్య ఏర్పాట్లు చేసేందుకు అనేక అంబులెన్సులను రోడ్డు మార్గం ద్వారా నడుపుతున్నారు. కానీ నర్మదా నది దిగువన స్థిరపడిన గ్రామాలు చాలా ఉండడం.. ఆ గ్రామానికి చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో ఈ రివర్ అంబులెన్స్ ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
అంబులెన్స్‌లోనే డాక్టర్:
దిగువ ప్రాంతాల ప్రజలకు ఈ రివర్ అంబులెనస్ ఎంతో మేలు చేయనుంది. వారంలో ఐదు రోజులు నడిచే ఈ అంబులెన్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రధాన డాక్టర్ ఎప్పుడూ ఉంటారు. ఇక దిగువ ప్రాంతాల్లో, వాగులు..వంకలు ఉన్న ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల బాధలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్న బాధే కలుగుతుంది. రోడ్డు మార్గంలో టైమ్‌కి అంబులెన్స్ రాక.. మృత్యువాత పడుతున్న వారిలో ఎక్కువగా వీరే ఉంటున్నారు. ఇలాంటి గ్రామాల్లోని గర్భిణులకు ఈ రివరల్ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వారిని టైమ్‌కి ఆరోగ్య కేంద్రాల్లో చేర్పించవచ్చు. గర్భిణిని, పుట్టబోయ్యే బిడ్డనూ కాపాడవచ్చు. మరి చూడాలి మిగిలిన రాష్ట్రాల వారు కూడా ఈ విధమైన ఆలోచనికి శ్రీకారం చుడతారేమో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free ambulance, Madya pradesh