Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్

కంప్యూటరైజ్డ్ రీఫిల్లింగ్ సిస్టమ్ ద్వారా అన్ని కోచ్‌లల్లో నీటిని నింపడానికి 5-7 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఈ విధంగా రైలు ఆలస్యాన్ని తగ్గించొచ్చు. ఇప్పటికే విజయవాడ స్టేషన్‌లో ఇలాంటి వ్యవస్థ ఉంది.

news18-telugu
Updated: January 31, 2019, 11:54 AM IST
Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్
Attention Please: ఇకపై మీ రైలు ఆలస్యంగా రాదు... భారతీయ రైల్వే కొత్త ప్లానింగ్
news18-telugu
Updated: January 31, 2019, 11:54 AM IST
మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు... భారతీయ రైల్వే పనితీరుపై వినిపించే సెటైర్ ఇది. భారతీయ రైళ్లు ఆలస్యంగా నడుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. రైలు ఆలస్యంగా వస్తే విశేషమేమీ కాదు. అదే రైలు సమయానికి వచ్చిందంటే ఆశ్చర్యపోవాలి. కానీ ఇకపై ఈ పరిస్థితి మారబోతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే పలు మార్పులు చేస్తోంది. రైల్వే స్టేషన్లను మాత్రమే కాదు రైళ్లను ఆధునీకరిస్తోంది. మౌలిక వసతులతో పాటు సాంకేతిక అంశాలనూ మెరుగుపరుస్తోంది. రైళ్లు కూడా సమయానికి స్టేషన్‌కు చేరుకోవడం, ప్రయాణికులను వేళకు గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేయబోతోంది రైల్వే.

Read this: SBI Data leak: ఎస్‌బీఐ అకౌంట్ల నుంచి మీ బ్యాలెన్స్ వివరాలన్నీ లీక్

Train timings, Train delay, indian railways, irctc ticket booking, irctc website, irctc booking tips, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్‌సీటీసీ బుకింగ్ టిప్స్, భారతీయ రైల్వే, రైలు ఆలస్యం

రైలు కోచ్‌లల్లో నీటిని రీఫిల్ చేసే ప్రక్రియ రైళ్లు ఆలస్యంగా నడవడానికి ప్రధాన కారణం. అందుకే ఇకపై కంప్యూటరైజ్డ్ వాటర్ రీఫిల్లింగ్ పద్థతిని ప్రవేశపెట్టబోతోంది. సాధారణంగా ఒక కోచ్‌లో నీటిని రీఫిల్ చేయాలంటే 20 నిమిషాల వరకు సమయం పడుతుంది. రైలులోని అన్ని కోచ్‌లల్లో నీటిని రీఫిల్ చేయాలంటే ఒక్కోసారి గంటన్నర సమయం పడుతుంది. అదే కంప్యూటరైజ్డ్ రీఫిల్లింగ్ సిస్టమ్ ద్వారా అన్ని కోచ్‌లల్లో నీటిని నింపడానికి 5-7 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుంది. ఈ విధంగా రైలు ఆలస్యాన్ని తగ్గించొచ్చు. ఇప్పటికే విజయవాడ స్టేషన్‌లో ఇలాంటి వ్యవస్థ ఉంది.



Read this: OMG: సెలవులు ఎన్‌క్యాష్ చేసుకుంటే రూ.19 కోట్లు వచ్చాయి

irctc news, indian railways, pos in trains, debit card credit card, food bills, ఐఆర్సీటీసీ, పీఓఎస్, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు, ఆహార పదార్థాలు, భారత రైల్వే, ధరల దోపిడీ
దక్షిణ మధ్య రైల్వే హెడ్‌క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఈ ఏడాది మార్చి నాటికి కంప్యూటరైజ్డ్ వాటర్ రీఫిల్లింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది రైల్వే. ఈ ప్రాజెక్ట్ అంచనా సుమారు రూ.2.5 కోట్లు. దీంతో పాటు రైల్వే స్టేషన్లలో సిబ్బంది కోసం హోవర్‌బోర్డులను కూడా ప్రవేశపెట్టనుంది రైల్వే. ఫిర్యాదులు, సమస్యలపై సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంచనా. బ్రేక్ పవర్ సర్టిఫికెట్‌పై డ్రైవర్‌తో పాటు గార్డ్ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. రైలు ఎంత పొడవు ఉంటే అంత నడవాల్సిందే. హోవర్‌బోర్డు ఉంటే ఈ సమయం కూడా తగ్గుతుంది. ఇలా రైలు ఆలస్యానికి గల కారణాలను తెలుసుకొని ఒక్కో సమస్యకూ పరిష్కారాన్ని కనుగొంటోంది రైల్వే.
Loading...

ఇవి కూడా చదవండి:

IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

Paytm PUBG offer: పబ్‌జీ యూజర్లకు ఫ్రీ టీషర్ట్, కుర్తా పైజామా

Redmi Go: షావోమీ నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్
First published: January 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...