Medication: టీబీ, షుగ‌ర్, కేన్స‌ర్ పేషంట్‌ల‌కు గుడ్ న్యూస్‌.. త‌గ్గ‌నున్న మందుల ధ‌ర‌లు

ప్రతీకాత్మక చిత్రం

టీబీ, షుగ‌ర్, కేన్స‌ర్ బారిన పడిన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారు నిత్యం మందులు(Medicine) వాడాల్సిందే. వారికి మందు(Medicine) ల ఖ‌ర్చు త‌గ్గించేలా కేంద్రం తాజా నిర్ణ‌యం తీసుకొంది.

 • Share this:
  టీబీ, షుగ‌ర్, కేన్స‌ర్ బారిన పడిన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారు నిత్యం మందులు(Medicine) వాడాల్సిందే. వారికి మందుల ఖ‌ర్చు త‌గ్గించేలా కేంద్రం తాజా నిర్ణ‌యం తీసుకొంది.
  39 ర‌కాల మందుల ధ‌ర‌లు త‌గ్గుతాయి..
  కేన్సర్‌, టీబీ, షుగర్‌ వ్యాధుల చికిత్స, నివారణలకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త‌గ్గ‌నున్నాయి. ఇందు కోసం నేష‌న‌ల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియ‌ల్ మెడిసిన్స్‌(National List of Essential Medicines) ఈ మందుల ధ‌ర‌ల‌ను స‌వ‌రించ‌నుంది. ఎఎల్ఈఎం కొత్త‌గా చేర్చిన జాబితాలోని మందుల‌ను ఎంత ధ‌ర‌కు విక్ర‌యించాలో నేష‌నల్ ఫార్మ‌సుటిక‌ల్ ప్రైసింగ్ అథారిటీ(national pharmaceutical pricing authority)  నిర్ణ‌యిస్తుందని అధికారులు తెలిపారు.
  కేన్సర్, షుగర్, టీబీ రోగులు దీర్ఘ‌కాలం మందులు వాడాల్సి ఉంటుంది. వారికి నిత్యం మందుల కొనుగోలు ఆర్థికంగా భారంగా మారుతోంది. పేద‌లు చాలా మంది మందులు కొన‌లేక వాటిని స‌రిగా వినియోగించ లేక‌పోతున్నారు. దీని వ‌ల్ల వారి ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకొంది.

  Y-Break App: 5 నిమిషాలు యోగా బ్రేక్ తీసుకోవాలి: ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం సూచ‌న
  ఎన్‌ఎల్‌ఇఎంలో 39 ఔషధాలను చేర్చనున్న ప్రభుత్వం మరో 16 ఔషధాలను ఆ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదించనుంది. వీటితోపాటు బ్యాక్టీరియల్‌(Bactireial) ఇన్ఫెక్షన్స్‌ నివారణకు వాడే ఎరిత్రోమైసిన్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, ఎయిడ్స్ మందులు వంటివి తొల‌గించే జాబితాలో ఉన్న‌ట్టు స‌మాచారం.
  స‌హ‌జ చిట్కాల‌తో షుగ‌ర్‌ను నియంత్రించుకోవ‌చ్చు..
  మనం ఏం తిన్నా... అందులోని షుగర్.. రక్తంలో కలుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇన్సులిన్(insulin) అనేది మన బాడీని, బ్లడ్‌నీ కంట్రోల్ చేస్తుంది. సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే... బీపీ వచ్చి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు... రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యగలవు. అలాగే కొన్ని ఇంటి చిట్కాలు కూడా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. అందువల్ల అవేంటో తెలుసుకుందాం. పసుపు, ఉసిరి, కాకరకాయ, మామిడి ఆకులు, దాల్చిన చెక్క (Cinnamon), అవిసె గింజలు, మెంతులు (Fenugreek), బెర్రీస్, దానిమ్మలు, ఉసిరి వంటివి ఆహారంలో ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్‌రోగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  క్యాన్స‌ర్ రాకుండా తీసుకోవాల్సిన ఆహారం.
  నిత్య జీవితంలో మనం తినే బార్లీ, గోధుమలు, ఓట్స్, క్వినోవా ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి. మ‌నం తీసుకోనే ఆహ‌రంలో క్ర‌మం తప్పకుండా క్వినోవా(quinoa) తింటే చాలా రకాల వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని కూడా దూరం చేయవచ్చు.
  Published by:Sharath Chandra
  First published: