Home /News /national /

GOOD NEWS FOR THOSE COMPANIES SEBI HAS GIVEN PERMISSION FOR IOP HOW MANY CRORES WILL BE COLLECTED UMG GH

IPO: ఆ కంపెనీలకు గుడ్ న్యూస్ .. ఐవోపీకి అనుమతి ఇచ్చిన సెబీ.. ఎన్ని కోట్లు సేకరించనున్నాయంటే !

 ఆ కంపెనీలకు గుడ్ న్యూస్ .. ఐవోపీకి అనుమతి ఇచ్చిన సెబీ.. ఎన్ని కోట్లు సేకరించనున్నాయంటే !

ఆ కంపెనీలకు గుడ్ న్యూస్ .. ఐవోపీకి అనుమతి ఇచ్చిన సెబీ.. ఎన్ని కోట్లు సేకరించనున్నాయంటే !

2022-23 ఏప్రిల్- జులై కాలంలో ఇనిషియల్‌ పబ్లిక్ ఆఫరింగ్‌(IPO)ల ద్వారా మొత్తం రూ.45,000 కోట్ల నిధులను సమీకరించడానికి 28 కంపెనీలకు సెబీ(SEBI) అనుమతి ఇచ్చింది. అంతకుముందు 11 కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్‌లో అడుగుపెట్టి దాదాపు రూ.33,000 కోట్లకు పైగా సేకరించాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
కరోనా(corona) సమయంలో భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు(Stock Market) ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొవిడ్‌ పరిస్థితులు చక్కబడుతున్న కాలంలో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం పరిణామాలు కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. యూఎస్‌, యూరోపియన్‌ దేశాలు విధించిన ఆంక్షలు, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి ఆగిపోయిన వాణిజ్యం వంటివి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రకాల వస్తువుల ధరలను అమాంతం పెరిగేలా చేశాయి. ఆయిల్‌ ధరలు గరిష్టాన్ని తాకాయి. దీంతో నిధుల సమీకరణకు ఐపీఓల ద్వారా వచ్చేందుకు చాలా కంపెనీలు సాహసించలేదు. అయితే 2022-23 ఏప్రిల్- జులై కాలంలో ఇనిషియల్‌ పబ్లిక్ ఆఫరింగ్‌(IPO)ల ద్వారా మొత్తం రూ.45,000 కోట్ల నిధులను సమీకరించడానికి 28 కంపెనీలకు సెబీ(SEBI) అనుమతి ఇచ్చింది. అంతకుముందు 11 కంపెనీలు ఐపీఓల ద్వారా మార్కెట్‌లో అడుగుపెట్టి దాదాపు రూ.33,000 కోట్లకు పైగా సేకరించాయి.

సరైన సమయం కోసం..
రెగ్యులేటర్ క్లియరెన్స్ పొందిన సంస్థలలో లైఫ్ స్టైల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ ఇండియా, ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్స్ అండ్‌ ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ అనుబంధ సంస్థ భారత్ ఎఫ్‌ఐహెచ్‌, టీవీఎస్‌ సప్లై చైన్ సొల్యూషన్స్, బ్లాక్‌స్టోన్-బ్యాక్డ్‌ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్‌లియోడ్స్‌ ఫార్మాసుటికల్స్‌, సూపర్-స్పెషాలిటీ మదర్, బేబీకేర్ చైన్ క్లౌడ్‌నైన్‌ నిర్వహిస్తున్న కిడ్స్‌ క్లినిక్‌ ఇండియా ఉన్నాయి. ఈ సంస్థలు తమ IPOల ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాలుగా ఉన్నాయి కాబట్టి, ఈ సంస్థలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకర్లు తెలిపారు.

ఆనంద్ రాఠి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, హెడ్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు మాట్లాడుతూ..‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు సవాలుగా ఉన్నాయి. ఇప్పటికే సెబీ అనుమతి పొందిన కంపెనీలు ఐపీఓ ప్రక్రియను ప్రారంభించడానికి సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాయి. వాస్తవానికి చాలా కంపెనీలు ప్రాసెస్‌ను పూర్తి చేసి, సరైన సమయం కోసం వేచి ఉన్నాయి.’ అని వివరించారు.

రూ.45,000 కోట్ల సమీకరణ లక్ష్యం
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) డేటా ప్రకారం.. మొత్తం 28 కంపెనీలు 2022-23 ఏప్రిల్- జులై మధ్యకాలంలో నిధుల సేకరణ కోసం ఐపీఓల ద్వారా మార్కెట్‌లో అడుగు పెట్టేందుకు రెగ్యులేటర్ క్లియరెన్స్‌ను పొందాయి. ఈ సంస్థలు మొత్తం రూ.45,000 కోట్లను సమీకరించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11 కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించి రూ.33,254 కోట్లను రాబట్టాయి. ఈ మొత్తంలో ఎక్కువగా(రూ.20,557 కోట్లు) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించింది.

ఈ కంపెనీలన్నీ ఏప్రిల్-మేలో ప్రైమరీ మార్కెట్‌లోకి చేరాయి. మే తర్వాత ఒక్క పబ్లిక్ ఇష్యూ కూడా రాలేదు. ఇది ఐపీఓ మార్కెట్‌లో డ్రై స్పెల్‌ను సూచిస్తుంది. మొత్తం 2021-22లో రికార్డు స్థాయిలో రూ.1.11 లక్షల కోట్లను సమీకరించడానికి 52 కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించిన తర్వాత ఈ డ్రై స్పెల్‌ రావడం గమనార్హం. ఆకట్టుకునే నిధుల సమీకరణకు టెక్నాలజీ స్టార్టప్‌లు, బలమైన రిటైల్ భాగస్వామ్యం, భారీ లిస్టింగ్ లాభాల కారణంగా సాధ్యమై ఉండవచ్చు.

ఇదీ చదవండి: Ramayana Quiz: రామాయణం పోటీల్లో విజేతలుగా ముస్లిం విద్యార్థులు.. వీరు చెప్పిన మాటలు చదివితే ఆశ్చర్య పోతారు !పేటీఎం, జొమాటో, ఎల్‌ఐసీపై మార్కెట్‌ పరిస్థితుల ప్రభావం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఐపీఓకు రాకపోవడానికి.. సెకండరీ మార్కెట్‌లో షార్ప్‌ కరెక్షన్, పేటీఎం(Paytm), జొమాటో(Zomato) వంటి కొత్త డిజిటల్ కంపెనీలు విఫలం కావడం, ఎల్‌ఐసీ పేలవమైన పోస్ట్ లిస్టింగ్ పనితీరు సెంటిమెంట్‌లను ప్రతికూలంగా ప్రభావితం చేయడం వంటివి కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, చీఫ్ వీకే విజయకుమార్ చెప్పారు. మార్కెట్లలో ఒడిదుడుకులు, ధరల పనితీరుతో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల కారణంగా, పెట్టుబడిదారులు కొత్త ఇష్యూల పట్ల అప్రమత్తంగా ఉన్నారని ఆనంద్ రాఠి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్స్ రావు చెప్పారు.గత త్రైమాసికంలో భారీగా పడిపోయిన మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని, ముఖ్యంగా గత త్రైమాసికంలో కనిపించిన సెంటిమెంట్ కనిష్ట స్థాయి నుంచి మార్కెట్లు పెరుగుతున్నాయని, కొన్ని కంపెనీలు మార్కెట్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో అభిజిత్ తారే అభిప్రాయపడ్డారు. రాబోయే 2-3 నెలల్లో కొన్ని ఐపీఓలు పూర్తవుతాయని, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన భాగంలో మంచి మొత్తంలో నిధుల సేకరణ జరుగుతుందని భావిస్తున్నామని తారే చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: IPO, LIC IPO, Sebi, Tvs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు