రైల్వే ఉద్యోగులకు (Railway Employees) కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు 78 రోజుల బోనస్ (Bonus) ను ప్రకటించింది. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు బోనస్ ప్రకటన సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. గతేడాది నుంచి రైల్వే శాఖ భారీ లాభాలను గడించింది. ఈ క్రమంలోనే లాభాల్లో నుండి కొంత ఉద్యోగులకు కానుకగా ప్రకటించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైల్వే ఉద్యోగులు (Railway Employees) హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/PIBBengaluru/status/1580151380408270849
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Railway employee