ప్రస్తుతం ఎవరైనా ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడల్లా ఈపీఎఫ్ అకౌంట్ (EPF Account)ను కొత్త సంస్థ కిందకు బదిలీ చేసుకోవాల్సి వస్తోంది. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ముగింపు పలకనుంది. ఉద్యోగి ఎన్ని సంస్థలు మారినా ఈపీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఈపీఎఫ్ ఖాతా బదిలీ గురించి, అందులోని నిధుల గురించి ఉద్యోగం మారినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees) కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 20న జరిగిన 229వ రౌండ్ సమావేశంలో ఈపీఎఫ్ ఖాతా ఆటోమేటిక్ (EPF account) గా బదిలీ చేయడంపై ఏకాభిప్రాయం కుదిరింది.
Meghalaya: కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. మాజీ సీఎం సహా 11 మంది ఎమ్మెల్యేలు
దీనిపై కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ కేంద్రీకృత ఐటీ ఎనేబుల్డ్ వ్యవస్థను ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీడాక్ (C-DAC) అభివృద్ధి పరచింది. సెంట్రల్ డేటాబేస్ ద్వారా వివిధ కార్యక్రమాలు, ఈపీఎఫ్ సేవలు దశల వారీగా పూర్తి కానున్నాయి. ఈ కేంద్రీకృత వ్యవస్థ పీఎఫ్ ఖాతాదారుల డూప్లికేషన్‌ను నివారించడంతో పాటు విలీనాలను సులభతరం చేస్తుంది. ఇకపై ఉద్యోగి ఉద్యోగం మారినప్పుడల్లా పీఎఫ్ ఖాతా బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు’’ అని ఈ అధికారిక ప్రకటన వెల్లడించింది. ప్రస్తుతం యూఏఎన్ (Universal Account Number) నెంబరు అదే కొనసాగుతుంది. కానీ ఈపీఎఫ్ ఖాతా నెంబరు మార్చుకోవాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగం మారినా ఈపీఎఫ్ ఖాతా కూడా అదే కొనసాగుతుంది.
Odisha CM Convoy: ఒడిషాలో హీటెక్కిన రాజకీయం.. సీఎం కాన్వాయ్ పై బీజేవైఎం కోడి గుడ్ల దాడి..
* ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ప్రస్తుత ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగం మారితే పాత అకౌంట్ క్లోజ్ చేసుకుని కొత్తది ప్రారంభించుకోవాలి. లేదా ఈపీఎఫ్ ఖాతా సర్వీస్ కొనసాగించాలంటే దాన్ని కొత్త యజమాన్యానికి బదిలీ చేసుకోవాల్సి వస్తోంది. పాత యజమాని వద్ద ఉన్న ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బును ఈపీఎఫ్ సభ్యుడు కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవాలి. సేవా పోర్టల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ( Universal Account Number)ను ఆధార్ నెంబరుతో లింక్ చేసుకోవచ్చు. అది చేయలేకపోతే కొత్త యజమానికి ఫారం సమర్పించాల్సి ఉంటుంది.
Punjab: ఆ మహిళలకు రూ. 1000.. పంజాబ్‌పై కేజ్రీవాల్ హామీ ఎఫెక్ట్ ఎంత ?
* ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేసుకోవాలి?
ఈపీఎఫ్ నగదు డ్రా చేసినప్పుడు పన్ను మినహాయింపులు పొందాలంటే కనీసం ఐదేళ్లు ఉద్యోగం నిరంతరాయంగా చేసి ఉండాలి. ఒకే కంపెనీలో అయినా, వేర్వేరు కంపెనీల్లో అయినా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈపీఎఫ్ ఖాతా బదిలీ చేయకపోతే గత యజమానుల వద్ద పనిచేసిన వ్యవధిని ఈపీఎఫ్ ఖాతా సర్వీసులో లెక్కించరు. దీనివల్ల ఐదేళ్ల నిరంతర సర్వీస్ లేకపోతే, పాత ఈపీఎఫ్ ఖాతాలో వచ్చిన మొత్తం, దానిపై వచ్చిన వడ్డీపై పన్ను విధిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, PF account, Pf balance