Home /News /national /

GOLDEN TEMPLE A PERSON BEATEN TO DEATH AFTER ALLEGED SACRILEGE BID AT TEMPLE EVK

Golden Temple: గోల్డెన్ టెంపుల్‌ ప‌విత్ర‌ స్థ‌లంలోకి ప్ర‌వేశించిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి.. ఆగ్ర‌హంతో భ‌క్తుల దాడి.. మృతి చెందిన యువ‌కుడు

ప‌విత్ర స్థలంలోకి ప్ర‌వేశించిన యువ‌కుడు

ప‌విత్ర స్థలంలోకి ప్ర‌వేశించిన యువ‌కుడు

Golden Temple | అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను అప‌విత్రం చేసేందుకు ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నించాడు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డి వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి అత‌డిపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ యువ‌కుడు మ‌ర‌ణించాడు. దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

ఇంకా చదవండి ...
    అమృత్‌సర్‌ (Amritsar) లోని స్వర్ణ దేవాలయంలో పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను అప‌విత్రం చేసేందుకు ప్ర‌య‌త్నించిన యువ‌కుడిని శ‌నివారం కొట్టి చంపిన‌ట్టు పోలీసులు ధ్రువీక‌రించారు. స్వ‌ర్ణ దేవాల‌యం (Golden Temple) లో నిషేధిత ప్రాంతంలోకి ఓ యువ‌కుడు చొర‌బ‌డ్డాడు. ఆ యువ‌కుడు శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క 'సరూప్' ముందు ఉంచిన బంగారు ఖడ్గాన్ని తీయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది. అత‌ను అలా చేయ‌డంతో అక్క‌డి వారు అత‌న్ని కొట్టారు. ఈ దాడిలో యువ‌కుడు మ‌ర‌ణించించాడు. విష‌యం తెలుసుకొన్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొన్నారు.  ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

    ఏం జ‌రిగింది..
    ఓ 20 ఏళ్ల వ‌య‌సు ఉన్న వ్య‌క్తం శ‌నివారం సాయంత్రం 5.50 గంట‌ల స‌మయంలో గురుగ్రంథ సాహిబ్ ఉన్న గర్భగుడి చుట్టూ ఉన్న బంగారు రెయిలింగ్‌పైకి ఎక్కాడు. ఈ స‌మ‌యంలో ప్రార్థన జ‌రుగుతుంది. ఆ యువ‌కుడు సిరి సాహిబ్ (కత్తి)ని తీశాడు. దీంతో అక్క‌డున్న వారు అత‌న్ని ప‌ట్టుకొన్నారు. ఆ గొడ‌వ‌లో అత‌న్ని కొట్టారు. ఈ గొడ‌వ‌లో యువ‌కుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి శిరోమణి గురుద్వారా నిర్వహణ కమిటీ వెంట‌నే సీసీ టీవీ ఫుటేజీ విడుద‌ల చేయ‌లేదు.

    Uttar Pradesh: యూపీ+యోగీ= ఉప‌యోగీ.. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ స‌భ‌లో మోదీ ఆస‌క్తిక‌ర వాఖ్య‌






    కుట్రకు అవ‌కాశం - పంజాబ్ మాజీ సీఎం
    పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మరియు శిరోమ‌ణి అకాళిద‌ల్‌కు చెందిన ప్రకాశ్‌ సింగ్ బాదల్ ఎస్ ప్రకాష్ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇది చాలా బాధాకరమైంద‌ని అన్నారు. "మానవత్వం యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రం" వద్ద "ఇటువంటి బాధాకరమైన, ఆకస్మికమైన నేరం" ఒకే వ్యక్తి ద్వారా జరగడం నమ్మశక్యం కాదని బాదల్ అన్నారు, లోతుగా పాతుకుపోయిన కుట్ర యొక్క అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు.

    Monkeys Revenge: కుక్క‌ల‌పై కోతుల ప్ర‌తీకారం.. మ‌హారాష్ట్ర‌లో 250 కుక్క‌ల‌ను చంపిన కోతులు!


    మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం..
    ఈ సంఘటనపై శిరోమణి గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అపవిత్ర సంఘటనను ఒంటరిగా చూడకూడదని అన్నారు. ఇది సిక్కుల మనోభావాలను రెచ్చగొట్టి పంజాబ్ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్రగా కనిపిస్తోంద‌ని అన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Police, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు