కొన్ని ఘటనల గురించి తెలిసినప్పుడు చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే భారతదేశంలో చోటుచేసుకుంది. ఆకాశం నుంచి అద్భుతమైన రాయి నేలపై పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉస్మానాబాద్ జిల్లాలోని (Osmanabad district) వశి నగరానికి సమీపంలో ఉన్న పొలంలో ఆకాశం నుంచి ఒక రాయి పడిపోయింది. అది పసిడి వర్ణంలో ఉండటంతో చాలా మంది దానిని బంగారు రాయిగా(Golden stone) భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలో రైతులు పొలంలో ఉండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ రైతుకు 7 నుంచి 8 అడుగుల దూరంలో భారీ శబ్దంతో ఈ బంగారు రాయి పడిపోయింది. ఈ రాయి రెండు కిలోల బరువు ఉంది. అనంతరం ఆ రాయిని తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు పొలం వద్దకు వచ్చి రాయిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రభు నివృతి మాలి అనే రైతు తన పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. అయితే ఉస్మానాబాద్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామునే ప్రభు.. తన పొలంలో నీరు ఉందా?, లేదా? తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్లాడు. అయితే అతడు పొలంలో ఉన్న సమయంలో గాలిగా పెద్ద శబ్దం వచ్చింది. అతడు నిలబడిన చోటుకు కొద్ది దూరంలో ఆకాశం నుంచి రాయి పడింది. చూస్తే అది బంగారు రాయి. దాని బరువు 2 కిలోల 38 గ్రాములు ఉంది.
ఈ ఆకస్మిక పరిణామంతో ప్రభు భయపడ్డాడు. అతను వెంటనే తహసీల్దార్ నర్సింహ జాదవ్‌కు సమాచారం అందించాడు. రాయిని తహసీల్ కార్యాలయం ప్రాథమిక తనిఖీ తర్వాత ఉస్మానాబాద్‌లోని ఇండియన్ జియోలాజికల్ సర్వేకి పంపారు. ఇక, ఆ రాయి బంగారు రంగులో ఉందని, వివిధ పొరలను కలిగి ఉంది. ఆ రాయి 7 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు ఉంది. రాయి మందం మూడున్నర అంగుళాల కంటే ఎక్కువని అధికారులు చెబుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.