హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Golden Chance: ఒక్క ఛాన్స్ కావాలా..? ఫిల్మ్ మేకింగ్‌లో ఆసక్తి ఉందా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా చేయండి

Golden Chance: ఒక్క ఛాన్స్ కావాలా..? ఫిల్మ్ మేకింగ్‌లో ఆసక్తి ఉందా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా చేయండి

ఫిలిమ్ మేకర్ అవ్వాలి అనుకున్న వారికి అద్భుత అవకాశం

ఫిలిమ్ మేకర్ అవ్వాలి అనుకున్న వారికి అద్భుత అవకాశం

Azadi Ka Amrit Mahotsav: ఎవరికైనా.. మూవీ మేకింగ్ అంటే ఆసక్తి ఉందా..? అయితే మీ కోసం ఓ అద్భుత అవకాశం వచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా చేయండి.. డైరెక్టర్ అయిపోండి.

Azadi Ka Amrit Mahotsav: చాలామందిలో అద్భుత ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ (Technology) పెరిగిపోయింది. అద్బుతమైన కెమెరాలు.. వాటిని తలదన్నే మొబైల్స్ చేతిలో ఉండడంతో టాలెంట్ పెరిగింది. మొబైల్ లోని కెమెరాతోనే మంచి వీడియోలు తీస్తూ అద్భుతాలు చేసే వారు చాలామంది ఉన్నారు. ఫిల్మ్ మేకర్  (Film maker)గా మారాలని కోరిక ఉన్నవారు కోట్ల మందే ఉన్నారు. కానీ సరైన అవకాశాలు లేకా..? టిక్ టాక్, యూట్యూబ్ (Youtube) లాంగి వాటికే పరిమితమవుతారు. ముఖ్యంగా చాలామందికి ఫిల్మ్ కు డైరెక్ట్ చేయాలని ఆసక్తి ఉంటుంది. కానీ అవకాశం లేక.. చేసినా ఎవరు చూస్తారు అనే భయంతో మనసులో కోరికను అలానే ఉంచుకుంటారు. కొంతమందికి ఫిలిమ్ మేకింగ్ డ్రీమ్ గా ఉంటుంది. అయితే అలాంటి వారి అందరికీ గొప్ప అవకాశం..? ఒక్క చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారందరికి నిజమైన ఛాన్స్.. ఈ ప్రపంచానికి మీ ప్రతిభను పరిచయం చేయాలనుకున్నట్టైతే ఇదే అసలైన వేదిక.. నేరుగా కేంద్ర ప్రభుత్వ(Union Government) మే ఓ అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చింది. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (Azadi Ka Amrit Mahotsav) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్రం ప్రభుత్వం ’75 క్రియేటివ్‌ మైండ్స్‌ ఆఫ్‌ టుమారో’ (???????? ????? ?? ????????')  పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా ఔత్సాహిక ఫిలిమ్‌ మేకర్స్‌ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డైరెక్షన్, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్‌, యాక్టింగ్‌, ప్లేబ్యక్‌ సింగింగ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ లేదా స్క్రిప్ట్‌ రైటింగ్‌లో ఆసక్తి ఉన్న వారు ఇందలో పాల్గొనవవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ఐ అండ్‌ బీ, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.


దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనున్నాయి. అప్లికేషన్స్‌ పంపించిన వారిలో 75 మందిని ఎంపిక చేసి గోవాలో జరగనున్న 52వ ఇంటర్‌నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివిల్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు కచ్చితంగా భారతీయులై ఉండాలి. అభ్యర్థలు పంపించే వీడియో 5 నిమిషాల కంటే తక్కువ 10 నిమిషాలు మించకుండ ఉండాలి. షార్ట్‌ఫిలిమ్‌ను ఆయా భాషల్లో రూపొందించినప్పటికీ ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. అభ్యర్థుల వయసు 01-10-2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు. అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా https://www.dff.gov.in/ వెబ్‌సైట్‌లోని ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తివివరాలను నింపి india75.iffi@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలి.

First published:

Tags: Central governmennt, Independence Day, India news, National News

ఉత్తమ కథలు